AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (February 11, 2026): మేష రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో బాగా పురోగతి చెందుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 11 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 11, 2026): మేష రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో బాగా పురోగతి చెందుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో బాగా పురోగతి చెందుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంటా బయటా బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల పురో గతికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పెరుగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్య మైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆహార, విహారాల్లో అశ్రద్ధ కారణంగా ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం కూడా లభిస్తాయి. వ్యాపారాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంది. కొందరు మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేయడంలో వ్యయప్రయాసలు తప్పవు. సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పని భారం ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నా వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్దిగా ఆలస్యం గానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తి గత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఇరకాటంలో పడ తారు. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబపరంగా ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగి పోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్య మైన వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాల్ని వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పని భారం బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆస్తి కొనుగోలు వ్యవహారంపై దృష్టి పెడతారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూల మైన వాతావరణం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.