AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలకృష్ణ ఎంత మంచి వారంటే.. ఆయనను మరోసారి అడుగుతానంటూ క్రేజీ కామెంట్స్ చేసిన సీనియర్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్లు ఉన్నా.. ఆ స్టార్‌డమ్ వెనుక ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే ఆ గొంతు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, వయసు పెరిగే కొద్దీ మరింత పెరుగుతున్న ఎనర్జీ లెవల్స్ చూస్తుంటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

Balakrishna: బాలకృష్ణ ఎంత మంచి వారంటే.. ఆయనను మరోసారి అడుగుతానంటూ క్రేజీ కామెంట్స్ చేసిన సీనియర్ హీరోయిన్
Balakrishna And Heroine
Nikhil
|

Updated on: Feb 11, 2026 | 6:30 AM

Share

ఆజానుబాహుడు, వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆ మాస్ హీరోతో ఒక్కసారైనా నటించాలని నేటితరం కుర్ర హీరోయిన్లు కూడా కలలు కంటుంటారు. అయితే, ఒకప్పుడు తెలుగు తెరపై హోమ్లీ పాత్రలతో మెప్పించిన ఒక సీనియర్ హీరోయిన్ తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

నటనలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న హీరోయిన్ లయ. అప్పట్లో కుర్రకారు ఫేవరెట్. పద్ధతిగా కనిపిస్తూనే తన పెర్ఫార్మెన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఈ మధ్య మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మన నందమూరి హీరో బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. షూటింగ్ సెట్‌లో ఆయన ఉంటే వచ్చే ఆ గంభీరమైన వాతావరణం, పని పట్ల ఆయనకు ఉండే నిబద్ధత చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. కేవలం సీరియస్‌గా ఉండటమే కాకుండా, చుట్టూ ఉన్న వారందరినీ ఎప్పుడూ నవ్విస్తూ, ఎంతో పాజిటివ్ ఎనర్జీని పంచుతారని తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.

Balakrishna And Laya

Balakrishna And Laya

అవకాశం వస్తే మళ్లీ..

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన విజయేంద్ర వర్మ అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. 2004 డిసెంబర్ 15న విడుదలైన ఈ సినిమాకు స్వర్ణ సుబ్బారావు దర్శకత్వం వహించగా, కొండా కృష్ణంరాజు నిర్మించారు. ఆ సినిమాలో హీరో ఆర్మీ ఆఫీసర్‌గా తన విశ్వరూపం చూపించారు. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోయినప్పటికీ, ఆ సమయంలో జరిగిన సరదా విషయాలు మాత్రం లయకు ఇప్పటికీ గుర్తున్నాయట. “అవకాశం వస్తే మళ్ళీ ఆయనతో కలిసి పని చేయాలని ఉంది” అని ఆమె తన కోరికను బయటపెట్టడం విశేషం.

ప్రస్తుతం లయ నటించిన ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఫిబ్రవరి 12 నుంచి నేరుగా ఓటీటీ వేదికగా సందడి చేయబోతోంది. ఇందులో శివాజీతో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకోగా.. అలీ, ధన్‌రాజ్ వంటి భారీ తారాగణం కూడా ఉంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఒక స్టార్ హీరో పట్ల ఆమెకు ఉన్న గౌరవం చూసి నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్ మళ్ళీ వెండితెరపై కనిపిస్తుందేమో చూడాలి.