Venky78: ఇద్దరు హీరోయిన్లతో మరోసారి జతకట్టనున్న వెంకీ మామ.. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో
విక్టరీలనే తన ఇంటి పేరుగా మార్చుకుని టాలీవుడ్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరో వెంకటేష్. ప్రేక్షకులను అలరిస్తూ తెరకెక్కిస్తున్న ప్రతి సినిమాకు మంచి పేరు తెచ్చుకుంటున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూగి కాంబోలో మరో సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.

F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి విజయవంతమైన సినిమాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వెంకీ సరసన నటించనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వెంకీ, అనిల్ కాంబోలో తెరకెక్కిన సినిమాలు కుటుంబ కథా చిత్రాలు కావడం, ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ హీరోగా నటించడంతో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద వీళ్లిద్దరి కాంబినేషన్‌కు తిరుగులేదనేలా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా వచ్చాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత వెంకీ78 షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాలో వెంకీ సరసన నటించే ఇద్దరు హీరోయిన్లు ఎవరనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 2027 సంక్రాంతి బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.

Venkatesh Anil Ravipudi Pooja Hegde And Keerthy Suresh
డబుల్ మ్యాజిక్..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించి సందడి చేశారు. అదే విధంగా కొత్త సినిమాలో కూడా వెంకటేష్‌తో ఇద్దరు హీరోయిన్లు జత కట్టనున్నారనే టాక్. వారిద్దరిలో ఒకరు మహానటి కీర్తి సురేష్ అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. హీరోయిన్‌గా నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది కీర్తి. వెంకీ లాంటి సీనియర్ హీరో సినిమాలో నటిస్తే టాలీవుడ్‌లో మళ్లీ భారీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఇక, రెండో హీరోయిన్‌గా బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్టు తెలుస్తోంది. F3 సినిమాలో స్పెషల్ సాంగ్‌లో వెంకీ సరసన డ్యాన్స్ చేసిన ఈ భామ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో ఉంది. హిందీలో వెంకీతో కలిసి నటించిన పూజ.. తెలుగులో మాత్రం మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. వెంకీ సినిమాలో నటించే అవకాశం దొరికితే టాలీవుడ్‌లో మరోసారి మెరిసిపోవచ్చని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, ప్రస్తుతానికి వీటిపై అధికారిక సమాచారం లేదు. ఉగాది పండుగ సందర్భంగా సినిమా టైటిల్‌తోపాటు ప్రధాన తారాగణాన్ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
