AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma : టీమిండియా అభిమానులకు పిడుగు లాంటి వార్త..వరల్డ్ కప్ మధ్యలోనే ఆస్పత్రి పాలైన అభిషేక్ శర్మ

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026 సమరంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. యువ సంచలనం, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. పెట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం.

Abhishek Sharma : టీమిండియా అభిమానులకు పిడుగు లాంటి వార్త..వరల్డ్ కప్ మధ్యలోనే ఆస్పత్రి పాలైన అభిషేక్ శర్మ
Abhishek Sharma (1)
Rakesh
|

Updated on: Feb 11, 2026 | 6:27 AM

Share

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026 సమరంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. యువ సంచలనం, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. పెట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 12న నామిబియాతో జరగబోయే కీలక మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో యూఎస్ఏతో జరిగిన పోరులో అభిషేక్ శర్మ మొదటి బంతికే అవుట్ అయి నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ ఆడే సమయానికే ఆయన తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. మ్యాచ్ తర్వాత ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు. పెట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను ఆస్పత్రిలో చేర్పించారని, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు తెలిపాయి.

సంజూ శాంసన్ రీ-ఎంట్రీ?

అభిషేక్ శర్మ దూరం కావడంతో కేరళ స్టార్ సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంగళవారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో సంజూ చాలా సేపు చెమటోడ్చాడు. ఒకవేళ అభిషేక్ అందుబాటులో లేకపోతే, ఇషాన్ కిషన్ తో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరడం భారత్‌కు ఊరట కలిగించే అంశం. అయితే జస్ప్రీత్ బుమ్రా కూడా అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

వరల్డ్ కప్ 2026: భారత జట్టు షెడ్యూల్

ప్రస్తుతం టీమిండియా గ్రూప్-A లో ఉంది. మొదటి మ్యాచ్‌లో యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో విజయం సాధించి మంచి ఊపులో ఉంది.

తర్వాతి మ్యాచ్: ఫిబ్రవరి 12, 2026 (నమీబియాతో, ఢిల్లీ)

మెగా ఫైట్: ఫిబ్రవరి 15, 2026 (పాకిస్థాన్‌తో, కొలంబో)

చివరి లీగ్ మ్యాచ్: ఫిబ్రవరి 18, 2026 (నెదర్లాండ్స్‌తో, అహ్మదాబాద్)

అభిషేక్ శర్మ నమీబియా మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ నాటికైనా ఆయన కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..