శ్రుతిహాసన్ జుట్టు రహస్యం ఇదేనట.. వారానికి రెండుసార్లు ఏం చేస్తుందంటే

Rajitha Chanti

Pic credit - Instagram

10 February 2026

హీరోయిన్ శ్రుతిహాసన్ జుట్టు ఎంత అందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆమెకు జుట్టు పెంచుకోవడం అంటే చాలా ఇష్టమట. ఎంత బిజీగా ఉన్నా జుట్టుకు జాగ్రత్తలు తీసుకుంటుందట.

అంత పొడవైన, నల్లగా, మందపాటి జుట్టుకు ఆమె తీసుకునే జాగ్రత్తలు బయటపెట్టింది. శ్రుతి తన జుట్టుకు రంగు వేయడం ఇష్టపడదు. జుట్టు నల్లగా ఉండేందుకు టిప్స్ పాటిస్తుందట.

ఆమె అందమైన జుట్టు రహస్యం నూనె. ఆమె జుట్టుకు నిత్యం నూనెతో మర్దన చేస్తుందట. ఇటీవల చర్మ నిపుణులు మాట్లాడుతూ.. జుట్టు పెరుగుదలకు హెయిర్ ఆయిల్ కు సంబంధం లేదన్నారు.

తలపై ఎక్కువసేపు నూనె ఉంచకూడదు. తలకు నూనె అవసరం లేదని చాలా మంది అంటారు. కానీ శ్రుతిహాసన్ తలస్నానం చేయడానికి ముందు కచ్చితంగా నూనె రాస్తుందట. 

ఉదయం స్నానం చేయడానికి ముందు రోజు రాత్రంతా తనకు నూనె అప్లై చేస్తుందట. ఆ త్వాత ఉదయాన్నే తలస్నానం చేస్తుందట. అలాగే ప్రతిరోజూ తలస్నానం చేస్తుందట శ్రుతి.

ఆమె తన తలకు నువ్వుల నూనెను ఉపయోగిస్తుందట. నువ్వులలోని అనేక పోషకాలు జుట్టుకు మంచివి అంటుంది. అలాగే ఆమె ఎక్కువగా తన జుట్టుకు కొబ్బరి నూనె వాడుతుందట.

అలాగే కఠినమైన కెమికల్స్ ఉండే షాంపూలు అస్సలు ఊపయోగించదట. అలాగే జుట్టుకు రంగు వేయడం లేదా ఖరీదైన హెయిర్ కలర్స్ ఉపయోగించడం చేయకుండా ఉంటుందట.

ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా శ్రుతి హాసన్ సినిమాలు తగ్గించింది. సలార్ చిత్రంలో చివరగా కనిపించిన శ్రుతి హాసన్.. ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.