AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??

ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??

Phani CH
|

Updated on: Feb 10, 2026 | 7:37 PM

Share

సంక్రాంతి పండుగకు విడుదలైన ఐదు తెలుగు సినిమాల్లో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీ విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు, జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 13 నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, శర్వానంద్ చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో ఉండగా, చిరంజీవి, నవీన్ పొలిశెట్టి సినిమాలకు డేట్స్ వచ్చేశాయి. సంక్రాంతి విజేతల ఓటీటీ సందడి ఇది.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులో ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు, ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతి క్రేజ్ ను క్యాష్ చేసుకున్న ఈ సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమాలన్నీ ఓటీటీలనూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రభాస్, శర్వానంద్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. చిరు మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు సినిమాల అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్స్ వచ్చేశాయి. అయితే సంక్రాంతి బరిలో ఈ సినిమాలతో దిగిన.. మాస్ మహారాజా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మాత్రం ఓటీటీ రిలీజ్ దూరంగానే ఉంది. ఇక ఈక్రమంలోనే ఎట్టకేలకు రవితేజ మూవీకి స్ట్రీమింగ్ రెడీ అయినట్టుగా ఓ న్యూస్ బయటికి వచ్చింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. అలాగే సునీల్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు అందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: ఏ మాత్రం తరగని బంగారం వెండి, ధరలు.. ఈ రోజు ఎంతంటే

Hyderabad: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు..

నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి

ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో

వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు