AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో

ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో

Phani CH
|

Updated on: Feb 10, 2026 | 6:39 PM

Share

అనంతపురం రాజకీయాల్లో 'క్షుద్ర పూజలు' సంచలనం రేపాయి. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు తాంత్రిక క్రియలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. తన ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులు ఈ నీచ చర్యలకు పాల్పడుతున్నారని శ్రావణి ఆరోపించారు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కుట్ర వెనుక సొంత పార్టీలోని వర్గమే ఉందా లేక రాజకీయ ప్రత్యర్థులా అనేది తేలాల్సి ఉంది. టెక్నాలజీ యుగంలోనూ ఇలాంటివి జరగడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సాధారణంగా రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు సహజం. కానీ అనంతపురం జిల్లాలో రాజకీయ శత్రుత్వం ఏకంగా ‘క్షుద్ర పూజల’ స్థాయికి చేరుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు తాంత్రిక క్రియలు నిర్వహించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఫిబ్రవరి 6వ తేదీన అనంతపురం అరవింద్ నగర్‌లోని ఎమ్మెల్యే నివాసం వద్దకు ఒక షిఫ్ట్ కారులో వచ్చిన దుండగులు.. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తెల్ల రాగులు, నువ్వులను చల్లి పరారయ్యారు. గత రెండు నెలలుగా ఎమ్మెల్యే శ్రావణి సహా ఆమె తల్లిదండ్రులు తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో, ఈ క్షుద్ర పూజల ఉదంతం అనేక అనుమానాలకు తావిస్తోంది. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే, తనను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కారు గుంటూరులో పనిచేసే ఒక అధికారిణి పేరుతో రిజిస్టర్ అయిందని తెలిసింది. అయితే ఆ కారును ఆమె ఎప్పుడో విక్రయించినట్లు సమాచారం. ఈ క్షుద్ర పూజల వెనుక సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం ఉందా? లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందా? అన్నది మిస్టరీగా మారింది. టెక్నాలజీ యుగంలోనూ ఇలా మంత్ర తంత్రాలతో రాజకీయం చేయడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు

ప్రేమంటే ఇదేరా !! పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే 70 కి.మీ సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు

ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా

ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. ఆత్మహత్యా ?? లేక హత్యా ??

పాక్ కు షాకిచ్చిన ట్రంప్ టీమ్‌ పీఓకేతో భారత మ్యాప్‌ సిద్ధం