హైదరాబాద్లోని మదీనాగూడ నారాయణ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. వెంటనే సిబ్బంది అప్రమత్తమై విద్యార్థులను బయటకు పంపించారు. మియాపూర్ పరిధిలోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్ భవనం సెల్లార్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా పొగలు వ్యాపించడంతో సిబ్బంది విద్యార్థులను భవనం నుంచి సురక్షితంగా ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.