AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamani: హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆమె తల్లిలా చూసుకుంది.. ఆమని పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా.. ?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సినిమాల్లో చక్రం తిప్పిన ఆమె ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు, లైఫ్, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. ప్రస్తుతం సినిమాలతోపాటు అటు సీరియల్స్ చేస్తూ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

Aamani: హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆమె తల్లిలా చూసుకుంది.. ఆమని పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా.. ?
Aamani
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2026 | 8:33 PM

Share

ప్రముఖ హీరోయిన్ ఆమని గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కథానాయికగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు సహాయ నటిగా కొనసాగుతున్నారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. ప్రస్తుతం సీరియల్స్ కూడా చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ.. కెరీర్ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీవీ సీరియల్స్‌లో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, అక్కమొగుడు, ముత్యమంత ముద్దు, ప్రస్తుతం ఇల్లు ఇల్లాలి పిల్లలు సీరియల్స్‌లో నటిస్తున్నానని ఆమని తెలిపారు. సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో టీవీ యూనిట్లు తనకు చాలా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని, మంచి పాత్రలను వదులుకోకూడదని అవి ప్రోత్సహిస్తున్నాయని ఆమె అన్నారు. తన కెరీర్ అంతా ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా సాగిందని ఆమని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

తన మేనేజర్ శోభ గురించి ఆమని ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. శోభ సినిమా ఇండస్ట్రీలో మొదటి మహిళా మేకప్ ఆర్టిస్ట్ అని, ఆమె తనకు కేవలం మేనేజర్ మాత్రమే కాదని, ఒక తల్లిలా, కుటుంబ సభ్యురాలిలా అండగా నిలుస్తుందని ఆమని పేర్కొన్నారు. నరేష్ సిఫార్సుతో శోభ తన మేనేజర్‌గా మారారని, అప్పటి నుంచి తన జీవితంలో, కెరీర్‌లో చాలా సానుకూల మార్పులు వచ్చాయని తెలిపారు. శోభ తమ పిల్లలను కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారని, హైదరాబాద్‌లో ఆమె తనకు ఒక సొంతం వంటివారని ఆమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

కెరీర్ మొదట్లో అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానని అన్నారు. అక్కడ చాలా రకాల పరిస్థితులు చూశానని.. తాను ఏ సినిమా ఆఫీసుకి వెళ్లినా మా అమ్మ నా కూడా వచ్చేదని… ఆమె లేకుండా రమ్మని అన్నవారు కూడా ఉన్నారని చెప్పుకోచ్చారు. ఆమె లేకుండా రాను అని చెప్పేదానిని. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారనేది తెలియడానికి తనకు కొంత సమయం పట్టిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..