AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆరుగురు అమ్మాయిలను హత్య చేసి.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, హారర్, క్రైమ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే మంగళవారం (ఫిబ్రవరి 10) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: ఆరుగురు అమ్మాయిలను హత్య చేసి.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
The Huntsman Movie
Basha Shek
|

Updated on: Feb 10, 2026 | 9:11 PM

Share

ఓటీటీలోకి అన్ని రకాల కంటెంట్ సినిమాలు ఉంటాయి. లవ్, ఫ్యామిలీ, కామెడీ, హారర్, క్రైమ్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంది. భాషతో సంబంధం లేకుండా ఈ జోనర్ సినిమాలను చూసేస్తున్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వివిధ భాషల్లో హిట్టయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ప్రతి వారం డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సీన్లు, స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని మూవీ లవర్స్ చెబుతున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉందని, మంచి థ్రిల్ అందిస్తోందని కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మ్యాక్స్ ఐసీయూ నర్స్ గా పని చేస్తుంటాడు. కోమాలో ఉన్న లింకన్ రైడర్ ను చూసుకోవడానికి మ్యాక్స్ వెళతాడు. అయితే లింకన్ ఆరుగురు అమ్మాయిలను చంపి కోమాలోకి వెళ్లాడని పోలీసులు భావిస్తుంటారు. అతను కోమాలో నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉంటారు.

మరోవైపు లింకన్ ఎలాంటి హత్యలు చేయలేదని, అతను నిర్దోషి అని భార్య వాదిస్తుంది. అదే సమయంలో లింకన్ ను చూసుకోవడానికి వెళ్లిన మ్యాక్స్ కు కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. ఊహించని విషయాలు బయటపడతాయి. మరి లింకన్ కోమా నుంచి బయటపడ్డాడా? అతను నిజంగానే ఆరుగురు అమ్మాయిలను హత్య చేశాడా? అసలు లింకన్ ఎందుకిలా మారిపోయాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ది హంట్స్ మన్. రొకైల్ కౌవిక హారిస్ తెరకెక్కించిన ఈ సినిమాలో షాన్ యాష్మోర్, గారెట్, ఎలిజబెత్ మిచెల్, జెస్సీ ష్రూమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ హాలీవుడ్ మూవీ మంగళవారం (ఫిబ్రవరి 10) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అన్నా విడాకులు
'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అన్నా విడాకులు
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్