James Cameron: మనసు మార్చుకున్న జేమ్స్ కామెరూన్
అవతార్: ఫైర్ అండ్ యాష్ ఆశించిన విజయం సాధించకపోవడంతో జేమ్స్ కామెరూన్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై పునరాలోచిస్తున్నారు. అవతార్ 3పై వచ్చిన కథనం పునరావృతం విమర్శలు, వసూళ్ల పతనం సిరీస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. కామెరూన్ ఇప్పుడు విజువల్స్ కాకుండా హిరోషిమా సంఘటన ఆధారంగా ఎమోషనల్ డ్రామా తీయాలని ప్లాన్ చేస్తున్నారు, అవతార్ సిరీస్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది.
అవతార్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌గా వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆలోచనలో పడ్డారు. ఆల్రెడీ ఎనౌన్స్ చేసిన అవతార్ నెక్ట్స్ పార్ట్స్‌ను పక్కన పెట్టి మరో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అవతార్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. పార్ట్ 2తో పోలిస్తే త్రీక్వెల్‌కు మంచి టాకే వచ్చినా.. వసూళ్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా అవతార్ పేరుతో దర్శకుడు జేమ్స్ కామెరూన్, చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెబుతున్నారన్న విమర్శలు వినిపించాయి. బిగ్ హిట్ అవుతుందనుకున్న అవతార్ 3కి నెగెటివ్ టాక్ రావటంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆలోచనలో పడ్డారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో రీ థింక్ చేస్తున్నారు. అవతార్‌ను ఐదు భాగాలుగా ప్లాన్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్, ఆల్రెడీ మూడు పార్ట్స్ రిలీజ్ చేశారు. మిగతా రెండు భాగాలు ప్రజెంట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. అవతార్ 3 ఫెయిల్యూర్ తరువాత ఈ సిరీస్‌కు బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు. విజువల్ గ్రాండియర్ కాకుండా ఓ ఎమోషనల్ డ్రామాతో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిరోషియా ఘటన నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కామెరూన్. అవతార్ సిరీస్ పూర్తయిన తరువాత స్టార్ట్ చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు ముందే పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు. విజువల్ గ్రాండియర్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారన్న విమర్శలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట కామెరూన్. అయితే ఈ నిర్ణయంతో కొత్త డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఇక అవతార్ సిరీస్‌కు తెర పడినట్టేనా అన్న అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
చనిపోయాడనుకున్నారు.. 28 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చాడు వీడియో
థాయిలాండ్‌లో ధోని హల్ చల్.. ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా?
సోమనాథ్ ఆలయానికి అంబానీ భారీ విరాళం వీడియో
మెక్సికోలో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు వీడియో
రీల్స్ కోసం పట్టాలపై పడుకున్న.. సాహస యువకుడికి ‘సన్మానం’వీడియో

