03 January 2026

ముట్టుకుంటే కందిపోయే అందం.. జాన్నీ బ్యూటీ సీక్రెట్స్ ఇవేనట.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ధడక్ సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే హిట్టుకొట్టింది

తర్వాత గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత.. విభిన్న కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

ఇటీవలే ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం తెలుగులో పెద్ది చిత్రంలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తన లుక్స్, ఫిట్నెస్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు బయటపెట్టింది. ఫిట్నెస్, బ్యూటీ విషయంలో తాను అస్సలు రాజీపడనని తెలిపింది.

చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసిన తర్వాత ముఖానికి ఆవిరి పడుతుందట. అలాగే ఫ్రూట్ ఫేస్ మాస్క్ ట్రై చేసిన తర్వాత తేనే, వెన్నను బ్యూటీ రీపేర్ కోసం వాడుతుందట.

నారింజ రసంతోపాటు పెరుగు, తేనెతో చేసిన ఫేస్ ప్యాక్స్ సైతం వాడుతుందట. ఐస్ క్యూబ్స్ తో నిత్యం ముఖానికి మసాజ్ చేస్తానని బాదం నూనె వాడుతానని తెలిపింది. 

ప్రతిరోజూ పిలెట్స్, బ్లాలెన్స్ వ్యాయమాలు చేస్తానని.. అలాగే రన్నింగ్, కార్డియో ఎక్కువగా చేస్తుందట. యోగా, మెడిటేషన్ ప్రతిరోజూ కచ్చితంగా చేస్తానని తెలిపింది.

ప్రస్తుతం జాన్వీ కపూర్ పెద్ది చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.