Moringa For Hair Growth: నల్లగా మెరిసే పొడవాటి జుట్టు కోసం మునగాకు..ఇలా వాడితే చాలు..!
పురాతన కాలంలో దాదాపు ఆడవారందరూ తమ జుట్టు చాలా పొడవుగా ఉండి ఒక్కోసారి పాదాలను కూడా తాకేలా ఉండేది. వారంతా తమ ఒత్తైన, పొడవైన నల్లటి కురుల కోసం ఏం వాడారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? మీ పొడవాటి జుట్టు కల కూడా నిజం కావడానికి, ఈ రోజు మనం పాత కాలంలో మహిళలు, రాణులు, యువరాణులు ఉపయోగించిన ఒక పద్ధతిని తెలుసుకోబోతున్నాం..ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఆ మ్యాజిక్ ఏంటంటే..

మనలో మోచేతులు, నడుము కూడా దాటని జుట్టుతో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది భుజాల వరకు మాత్రమే పెరిగి ఆగిపోయిన జుట్టుతోనే కనిపిస్తుంటారు. కానీ పురాతన కాలంలో దాదాపు ఆడవారందరూ తమ జుట్టు చాలా పొడవుగా ఉండి ఒక్కోసారి పాదాలను కూడా తాకేలా ఉండేది. వారంతా తమ ఒత్తైన, పొడవైన నల్లటి కురుల కోసం ఏం వాడారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? మీ పొడవాటి జుట్టు కల కూడా నిజం కావడానికి, ఈ రోజు మనం పాత కాలంలో మహిళలు, రాణులు, యువరాణులు ఉపయోగించిన ఒక పద్ధతిని తెలుసుకోబోతున్నాం..ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఆ మ్యాజిక్ ఏంటంటే..
మునగ ఆకుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. మునగలో విటమిన్ A, B, C, Eతో పాటు కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఉంచుతాయి. మునగలోని అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలంగా మార్చుతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. మునగలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలికల్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది.
మునగ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. మునగాకు చుండ్రు, దురద వంటి సమస్యలను సులువుగా తగ్గిస్తుంది. మునగలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకి పోషణను అందిస్తాయి. దీంతో జుట్టు రాలడం అదుపులోకి వస్తుంది. పొడవాటి కురులు పొందొచ్చు. మునగాకు జుట్టుకు మెరుపును ఇస్తుంది. మునగాకుల పేస్ట్‌ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా నిగారిస్తుంది. గోరువెచ్చని మునగ నూనెను తలకు రాసి మసాజ్ చేస్తే జుట్టు వేగంగా ఎదుగుతుంది. జుట్టు రాలడం అదుపులోకి వస్తుంది.
మునగ ఆకులను మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. ఆ పేస్ట్‌ను తలకు రాసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది. కురులు ఆరోగ్యంగా మారతాయి. మునగ ఆకులను డైట్‌లో చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్న వారు మునగ ఆకుల్ని డైట్‌లో చేర్చుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




