AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. ఇదేం తిండిరా బాబు..! రైల్లో మనోడి తినుడు చూసి ప్రయాణికులు..

ఈ వీడియోలో ఒక వ్లాగర్ ఆహారం తింటున్న విధానం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అతడు తింటున్న అసాధారణ కాంబోను ఆస్వాదించడం చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. మరికొందరు వామ్మో ఇదేం తిండిరా సామీ అన్నట్టుగా నోరెళ్ల బెట్టారు. పూర్తి వీడియోలో ఏముందంటే..

ఓరీ దేవుడో.. ఇదేం తిండిరా బాబు..! రైల్లో మనోడి తినుడు చూసి ప్రయాణికులు..
Vlogger Eats Raw Brinjal
Jyothi Gadda
|

Updated on: Jan 03, 2026 | 7:31 PM

Share

స్థానిక రైళ్లు, మెట్రోలలో రీల్స్‌ చేసే వారిని తరచూ మనం చూస్తూనే ఉంటాం. ఇకపోతే, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో మెట్రోరైళ్లు రీల్స్‌కు అడ్డగా మారుతుంటాయి. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా ముంబై లోకల్ రైల్లో తీసినదే. ఈ వీడియోలో ఒక వ్లాగర్ ఆహారం తింటున్న విధానం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అతడు తింటున్న అసాధారణ కాంబోను ఆస్వాదించడం చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. మరికొందరు వామ్మో ఇదేం తిండిరా సామీ అన్నట్టుగా నోరెళ్ల బెట్టారు. పూర్తి వీడియోలో ఏముందంటే..

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ రీల్‌ను కంటెంట్ సృష్టికర్త ప్రణయ్ జోషి షేర్ చేశారు. ఇది ఆన్‌లైన్‌లో చాలా ఆసక్తిని రేపింది. అతను రైలు కంపార్ట్‌మెంట్‌లో కూర్చుని పచ్చి అల్లం పైన టమాటా కెచప్‌ను ప్రశాంతంగా కలుపుతూ ఉండటంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. అక్కడున్న వారంతా షాక్‌తో అతని వైపుకే చూస్తుండగా అతను ఆ అల్లం ముక్కను కరకరలాడుతూ తింటాడు. అది తిన్న తరువాత అతను వాహ్..అంటూ అందరూ విస్తూ పోయేలా చేశాడు. మీకూ కావాలా అంటూ తోటి వారిని కూడా అడుగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మరో వెరైటీ కాంబో ట్రై చేశాడు. అరటిపండు, చాయ్‌తో కలిపి తింటున్నాడు. అది చూసిన తోటి ప్రయాణికులు అతని వింత చేష్టలు చూడలేక ముఖం తిప్పేసుకుంటున్నారు. కొందరు వాక్‌ అనుకుంటున్నారు. మరొక ప్రయాణీకుడు అతన్నికిందకు మీదకు తదేకంగా చూస్తున్నాడు. ఈ వింత అక్కడితో ఆగదు. సదరు వ్లాగర్ తాజా పచ్చి క్యాబేజీని, కోయకుండా పచ్చి వంకాయను కూడా అదేదో బన్‌ బట్టర్‌ జామ్‌ తిన్నంత ఈజీగా తినేస్తున్నాడు. ఇదంతా చూస్తూ అతని చుట్టూ ఉన్న వ్యక్తుల ముఖ కవళికలు చూడటం, నిజంగా మాటల్లో చెప్పలేనిది.

ఇకపోతే, వీడియో చివరిలో ఎవరో అతన్ని పచ్చి వంకాయ ఎందుకు తింటున్నారని అడుగుతాడు. కూరగాయలు పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించే సాధారణ ఆరోగ్య సలహాను ప్రస్తావించడం ద్వారా అతను తన చర్యలను కంపార్ట్‌మెంట్‌కు వివరిస్తాడు.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Prannay🐸 (@prannayjoshi)

చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు వైరల్ వీడియోను చూసి నవ్వు ఆపుకోలేకపోయారని కామెంట్ సెక్షన్‌లో చూపించారు. చాలా మంది ఆ వ్లాగర్ పచ్చి వంకాయను ఎలా తినగలిగాడో అంటూ ఆశ్చర్యపోయారు. మరికొందరు రైలు ప్రయాణికుల భావాలను చూసి ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గూగుల్‌ మ్యాప్స్‌లోని ఈ 7 సైలెంట్‌ ఫీచర్లు తెలుసా?
గూగుల్‌ మ్యాప్స్‌లోని ఈ 7 సైలెంట్‌ ఫీచర్లు తెలుసా?
రెండేళ్లుగా వర్కౌట్స్‌కు గుడ్‌బై! ఆ పనితో బరువు తగ్గా : హీరోయిన్
రెండేళ్లుగా వర్కౌట్స్‌కు గుడ్‌బై! ఆ పనితో బరువు తగ్గా : హీరోయిన్
గోల్డ్‌ లవర్స్‌కి గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు..!
గోల్డ్‌ లవర్స్‌కి గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు..!
రూ.కోట్ల ఆస్తి.. విదేశాల్లో లగ్జరీ లైఫ్! టాలీవుడ్‌ హీరోయిన్ ఎవరు?
రూ.కోట్ల ఆస్తి.. విదేశాల్లో లగ్జరీ లైఫ్! టాలీవుడ్‌ హీరోయిన్ ఎవరు?
ఏపీ రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి అప్పుడే
ఏపీ రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి అప్పుడే
ముఖంపై ఎప్పుడూ విచారమేనా? సైకాలజిస్ట్​లు చెబుతున్న షాకింగ్ నిజాలు
ముఖంపై ఎప్పుడూ విచారమేనా? సైకాలజిస్ట్​లు చెబుతున్న షాకింగ్ నిజాలు
తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి!
తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి!
బెబో ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? రివీల్ చేసిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్
బెబో ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? రివీల్ చేసిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్
ఆహార అలవాట్ల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్
ఆహార అలవాట్ల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్
గ్రోక్‌ను పిచ్చిపిచ్చిగా వాడే వారిని వదిలిపెట్టం..!
గ్రోక్‌ను పిచ్చిపిచ్చిగా వాడే వారిని వదిలిపెట్టం..!