AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే ఖరీదైన ఆవు.. ఏపీతో లింక్.. దీన్ని ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం పక్కా..

బ్రెజిల్‌కు చెందిన వియాటినా-19 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జాతికి చెందినవి. అద్భుతమైన జన్యుశాస్త్రం, అధిక రోగనిరోధక శక్తి, తీవ్రమైన వేడిని తట్టుకునే సామర్థ్యం దీని ప్రత్యేకతలు. దీని గుడ్లు, దూడల అధిక నాణ్యత కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీని జన్యువులకు భారీ డిమాండ్ ఉంది. దీన్ని ధర ఎంతంటే..?

ప్రపంచంలోనే ఖరీదైన ఆవు.. ఏపీతో లింక్.. దీన్ని ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం పక్కా..
Most Expensive Cow In World
Krishna S
|

Updated on: Jan 03, 2026 | 7:27 PM

Share

సాధారణంగా ఆవుల ధర వేలల్లో లేదా లక్షల్లో ఉంటుంది. కానీ ఒక ఆవు ధర ఏకంగా రూ.40 కోట్లు అంటే నమ్ముతారా? అవును.. బ్రెజిల్‌కు చెందిన వియాటినా-19 అనే ఆవు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచింది. దీని విలువ మన దేశంలోని విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్ల కంటే ఎంతో ఎక్కువ.

భారతీయ మూలాలే దీని ప్రత్యేకత

ఈ ఆవుకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీని మూలాలు మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నెల్లూరు జాతి పశువులలో ఉన్నాయి. దశాబ్దాల క్రితం భారత్ నుండి బ్రెజిల్‌కు తీసుకెళ్లిన ఈ జాతి పశువులు అక్కడ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇవి తీవ్రమైన వేడిని తట్టుకోగలవు. వీటికి రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ.

రూ. 40 కోట్ల ధర ఎలా వచ్చింది?

బ్రెజిల్‌లో జరిగిన ఒక వేలంలో ఈ ఆవు హక్కులలో కేవలం మూడింట ఒక వంతు వాటానే దాదాపు రూ. 11 కోట్లకు అమ్ముడైంది. దీని ప్రకారం లెక్కగడితే ఈ ఆవు మొత్తం విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని తేలింది. ఇంత ధర పలకడానికి ప్రధాన కారణం దీని అద్భుతమైన జన్యుశాస్త్రం.

ఇవి కూడా చదవండి

వియాటినా-19 విశేషాలు ఇవే

ఈ ఆవు బరువు దాదాపు 1100 కిలోలు. ఇది సాధారణ ఆవు కంటే రెండు రెట్లు ఎక్కువ. ఈ ఆవు గుడ్లు లక్షలాది రూపాయలకు అమ్ముడవుతాయి. దీని ద్వారా పుట్టే దూడలు అత్యంత నాణ్యమైన మాంసం, బలమైన శరీరాన్ని కలిగి ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు దీని జన్యువుల కోసం పోటీ పడుతుంటారు. ఇంత ఖరీదైన ఆవు కావడంతో దీనికి 24 గంటల పాటు సాయుధ భద్రత, సీసీటీవీ నిఘా ఉంటుంది. దీని సంరక్షణ కోసం ఒక ప్రత్యేక పశువైద్యుడు, కేర్ టేకర్ బృందం నిరంతరం అందుబాటులో ఉంటుంది.

మన దేశానికి చెందిన నెల్లూరు జాతి పశువులు అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు పొందడం నిజంగా గర్వకారణం. ఒక జంతువు జన్యువుల విలువ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి వియాటినా-19 ఒక నిదర్శనం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
10 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత..!
10 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత..!
ఇండియన్‌ ఆర్మీలో SSC టెక్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హత
ఇండియన్‌ ఆర్మీలో SSC టెక్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హత
60 రోజుల పాటు అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
60 రోజుల పాటు అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్‌..భారీగా సెలవుల ప్రకటన వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్‌..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
చనిపోయాడనుకున్నారు.. 28 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చాడు వీడియో
చనిపోయాడనుకున్నారు.. 28 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చాడు వీడియో
ఇవి ప్రపంచంలోని వింతైన వ్యాధులు.. వీటి గురించి తెలిస్తే షాకవుతారు
ఇవి ప్రపంచంలోని వింతైన వ్యాధులు.. వీటి గురించి తెలిస్తే షాకవుతారు
యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా?
యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా?
వెనిజులాపై అమెరికా దాడులు.. స్పందించిన భారత్..
వెనిజులాపై అమెరికా దాడులు.. స్పందించిన భారత్..