కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా.. అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
కొత్త ఇల్లు, శుభకార్యాలప్పుడు కొబ్బరికాయ కొట్టడం మన సంప్రదాయం. ఇది కేవలం ఆచారం కాదు, లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ అర్థాలున్నాయి. పురాణాల ప్రకా..రం శ్రీమహావిష్ణువుతో పాటు వచ్చిన శ్రీఫలం, ఎలక్ట్రోలైట్లు, మంచి కొవ్వులతో కూడిన ఆరోగ్య ప్రదాయిని. దీని వెనుకనున్న సంపూర్ణ ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త ఇల్లు, వాహనం కొన్నా లేదా ఏదైనా శుభకార్యం ప్రారంభించినా మనం ముందుగా చేసే పని కొబ్బరికాయ కొట్టడం. ఇది కేవలం తరం నుండి తరానికి వస్తున్న ఆచారం మాత్రమే కాదు.. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థాలు, మనోభావాలు, శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరికాయను మన సంప్రదాయంలో శ్రీఫలం అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
అహంకారాన్ని వీడటమే అసలు అర్థం
ఆధ్యాత్మికంగా చూస్తే.. కొబ్బరికాయను కొట్టడం అంటే మనలోని అహంకారాన్ని భగవంతుని ముందు బద్దలు కొట్టడమే. నారను తీయడం అనేది మనలోని ప్రాపంచిక కోరికలను, భౌతికవాదాన్ని వదిలేయడానికి సూచన. పెంకును పగలగొట్టడం అనేది కఠినమైన అహంకారం విచ్ఛిన్నం కావడాన్ని సూచిస్తుంది. లోపల ఉండే తెల్లని భాగం స్వచ్ఛతకు, శాంతికి నిదర్శనం. అహంకారం తొలిగిపోతేనే మనసు స్వచ్ఛంగా మారుతుందని దీని అర్థం.
పురాణ ప్రాశస్త్యం
పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు భూమిపైకి అవతరించినప్పుడు మానవాళి సంక్షేమం కోసం లక్ష్మీదేవిని, కామధేనువును, కొబ్బరి చెట్టును వెంట తీసుకువచ్చారు. అందుకే కొబ్బరికాయపై ఉండే మూడు కళ్లను బ్రహ్మ, విష్ణు, శివుడికి చిహ్నంగా భావిస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ చెట్టును అత్యంత పవిత్రంగా పూజిస్తారు.
శాస్త్రీయంగా ఆరోగ్య ప్రదాయిని
కేవలం భక్తి మాత్రమే కాదు కొబ్బరిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది.కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో కొబ్బరి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
కొబ్బరికాయ కొట్టడం అనేది అహంకారాన్ని విడిచిపెట్టి, స్వచ్ఛతను స్వాగతించి, దేవుని అనుగ్రహాన్ని పొందే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకే ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




