Vastu Tips: ఇంట్లో చీపురుని ఈ దిక్కున ఉంచితే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.. డబ్బే డబ్బు
Vastu for broom: వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వల్ల చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. చీపురిని పెట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ చీపురిని పెట్టకూడదు. దరిద్రం, ఇబ్బందులు వస్తాయి. లక్ష్మీదేవికి కోపం వస్తుందని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు..

వాస్తు శాస్త్రం.. నిర్మాణం.. దిక్కులు.. పంచభూతాల సమతూల్యత.. ఇలా ఎన్నో విషయాల గురించి చెబుతుంది. అయితే.. వాస్తు నియమాలు పాటించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇది శాంతి, సంపద, ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించేలా చేస్తుందని విశ్వసిస్తారు. వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారు.. ప్రతితీ వాస్తు శాస్త్రం ప్రకారమే.. ఇంటిని కట్టుకుంటారు.. అలాగే.. దాని ప్రకారమే.. వస్తువులను ఉంచుతారు.. అయితే.. చీపురు ఉంచడంపై వాస్తు శాస్త్రం పలు విషయాలను చెబుతోంది.. ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. దక్షిణ, పడమర దిశల మధ్య స్థలంలో ఉంచాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంకా చీపురును నిలబెట్టకుండా పడుకోబెట్టాలని సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధన సంబంధిత సమస్యలు ఉండవని పేర్కొంటున్నారు.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి..
ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే చీపురును వంటగదిలో పెట్టవద్దు, ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. సాయంత్రం తర్వాత వాడకూడదు. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పేర్కొంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురును ఉంచే విధానం సానుకూల శక్తిని ఆకర్షించి, ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి చీపురు విషయంలో కొన్ని నియమాలు పాటించడం మంచిదంటున్నారు.
చీపురు ఎప్పుడు కొనడం శుభప్రదం..
చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడం సకల దరిద్రానికి, ఇబ్బందులకు దారితీస్తుంది. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పించి, ఇంట్లో ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది. చీపురు కొనేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య, మంగళవారం, శనివారం, ఆదివారం వంటి రోజులు చీపురు కొనడానికి అనుకూలమైనవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.. సోమవారం శుక్లపక్షంలో చీపురు కొనడం అశుభం.. ఇది ఆర్థిక సమస్యలకు కారణం కావచ్చు.
ఎప్పుడు ఊడవాలి..
ఇంటిని తుడుచేటప్పుడు, ఊడ్చేటప్పుడు కూడా దిశ చాలా ముఖ్యం. పశ్చిమం లేదా ఉత్తరం వైపు నుంచే ఇంటిని శుభ్రం చేయాలి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు ఉంచడం పేదరికాన్ని సూచిస్తుంది. చీపురును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. సాయంత్రం తర్వాత ఇంట్లో చీపురు వాడటం మంచిది కాదు. ఈ వాస్తు నియమాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో సంపద, సుఖశాంతులు వెల్లివిరుస్తాయని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.
