Wolf Moon 2026: ఈరోజు రాత్రి ఆకాశంలో ‘వోల్ఫ్ మూన్’.. ఎలా, ఎప్పుడు చూడాలో తెలుసా?
జనవరి 3 శనివారం రోజున ఈ ఏడాదిలో తొలి పౌర్ణమి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఈ పౌర్ణమి రోజున రాత్రి కనిపించే చంద్రుడిని ‘వోల్ఫ్ మూన్’ (Wolf Moon)ని పిలుస్తారు. ఇందుకు ఒక కారణం ఉంది. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత ఈ వోల్ఫ్ మూన్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఈ వోల్ఫ్ మూన్ గురించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నూతన సంవత్సరంలో తొలి పౌర్ణమి శనివారం (జనవరి 3) రోజున వచ్చింది. ఈ పౌర్ణమికి ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పౌర్ణమినాడు చంద్రుడు 16 దశలతో నిండి ఉంటాడు. పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణంగా కనిపిస్తూ ప్రకాశిస్తాడు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఈ పౌర్ణమి రోజున రాత్రి కనిపించే చంద్రుడిని ‘వోల్ఫ్ మూన్’ (Wolf Moon)ని పిలుస్తారు. ఇందుకు ఒక కారణం ఉంది. ఈ వోల్ఫ్ మూన్ గురించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వోల్ఫ్ మూన్ అని ఎందుకు అంటారు?
పురాతన కాలంలోనూ జనవరి నెల చాలా చల్లగా ఉండేదని చెబుతారు. ఈ సమయంలో ప్రజలు ఎక్కువ సమయం ఇంటిలోపలే గడిపేవారు. వీరికి తోడేళ్ల అరుపులు స్పష్టంగా వినిపించేవి. అందుకే జనవరి నెలలో వచ్చే పౌష్ పౌర్ణమిని వోల్ఫ్ (తోడేళ్ల) మూన్ అని పేరు పెట్టారని చెబుతారు.
వోల్ఫ్ మూన్ ఎప్పుడు కనిపిస్తుంది?
భారత కాలమాన ప్రకారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. దీంతో చంద్రుడు (వోల్ఫ్ మూన్) సాధారణం కంటే పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ సమయంలో భూమి, సూర్యుడి మధ్య దూరం 147,99,894 కిలోమీటర్లు ఉంటుంది.
ఈరోజు వోల్ఫ్ మూన్‌ను సాధారణ కళ్లతో స్పష్టంగా చూడవచ్చు. అయితే, ప్రస్తుతం వాతావరణం చాలా చలిగా ఉంటోంది. ప్రధాన నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. మేఘాలు, కాలుష్యం చంద్రుడిని స్పష్టంగా కనిపించకుండా చేసే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వోల్ఫ్ మూన్‌ను టెలిస్కోప్ లేదా ఇతర ఖగోళ పరికరాల సాయంతో వీక్షించవచ్చు.
జనవరి 3న చంద్రోదయం: సాయంత్రం 5.49 గంటలకు అస్తమయం: ఉదయం 8 గంటలకు (జనవరి 4).
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.
