AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగ్నంగా నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందా.. అసలు నిజాలు తెలిస్తే షాక్ అవడం పక్కా..

నగ్నంగా నిద్రపోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ నిజమేనా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..? దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు సహాయపడి, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. కానీ ఆయుష్షు పెరుగుతుందా..? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నగ్నంగా నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందా.. అసలు నిజాలు తెలిస్తే షాక్ అవడం పక్కా..
Does Sleeping Naked Increase Lifespan
Krishna S
|

Updated on: Jan 02, 2026 | 9:02 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. “నగ్నంగా నిద్రపోయే మహిళలు మరో 7 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు” అమెరికన్ టెక్ వ్యాపారవేత్త బ్రయాన్ జాన్సన్ ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేయడంతో ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల నిజంగానే ఆయుష్షు పెరుగుతుందా..? దీని వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.

7 ఏళ్ల అదనపు జీవితం: నిజమా.. కల్పితమా?

శాస్త్రీయంగా చూస్తే నగ్నంగా నిద్రపోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని నిరూపించే ఎటువంటి క్లినికల్ లేదా ఎపిడెమియోలాజికల్ ఆధారాలు లేవు. క్యాన్సర్‌ వంటి మహమ్మారిని పూర్తిగా నయం చేసినా సగటు మానవ ఆయుష్షు కేవలం 2 నుండి 3 ఏళ్లు మాత్రమే పెరుగుతుంది. అలాంటిది కేవలం దుస్తులు లేకుండా నిద్రపోతే 7 ఏళ్లు పెరుగుతుందనే వాదన కేవలం అతిశయోక్తి మాత్రమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నిద్ర – ఉష్ణోగ్రత మధ్య సంబంధం

నగ్నంగా నిద్రపోవడం వల్ల ఆయుష్షు పెరగకపోయినా, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. 2012లో జర్నల్ ఆఫ్ ఫిజియోలాజికల్ ఆంత్రోపాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మెదడు త్వరగా గాఢ నిద్రలోకి వెళ్తుంది. దుస్తులు వేడిని బంధించడం వల్ల నిద్రకు ఆటంకం కలగవచ్చు. శరీరం తన ఉష్ణోగ్రతను తానే నియంత్రించుకోవడాన్ని థర్మోర్గ్యులేషన్ అంటారు. నగ్నంగా ఉన్నప్పుడు చర్మం గాలి పీల్చుకోవడానికి వీలుంటుంది, ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. చల్లని వాతావరణంలో నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది.

స్త్రీ, పురుషులకు ప్రత్యేక ప్రయోజనాలు

బ్రయాన్ జాన్సన్ తన పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, నగ్నంగా నిద్రపోవడం వల్ల కొన్ని శారీరక ప్రయోజనాలు ఉన్నాయి.

పురుషులకు: వృషణాలను చల్లగా ఉంచడం వల్ల స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంది.

స్త్రీలకు: జననేంద్రియాల వద్ద గాలి ప్రసరణ బాగుండటం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.

సాన్నిహిత్యం: భాగస్వామితో స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక బంధాన్ని బలపరుస్తుంది.

నిపుణులు ఏమంటున్నారు?

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రకారం.. నగ్నంగా నిద్రపోవడం అనేది వ్యక్తిగత సౌకర్యానికి సంబంధించిన విషయం. దీనివల్ల నేరుగా ఆయుష్షు పెరగదు. అయితే మంచి నిద్ర వల్ల గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుతాయి. పరోక్షంగా ఇది ఆరోగ్యకరమైన జీవనానికి సహాయపడుతుంది. నగ్నంగా నిద్రపోవడం వల్ల 7 ఏళ్లు ఎక్కువ బతుకుతారు అనేది ముమ్మాటికీ తప్పుడు వాదన. కానీ చల్లని వాతావరణంలో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది మీ మొత్తం ఆరోగ్యానికి, నిద్ర నాణ్యతకు చాలా మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..