AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secret To Aging: వ్యాధులు లేని వృద్ధాప్యం మీ సొంతం! లక్ష మందిపై జరిగిన పరిశోధనలో తేలిన నంబర్ 1 డైట్ ప్లాన్!

ఎక్కువ కాలం జీవించడం అంటే కేవలం వంద ఏళ్లు బతకడం మాత్రమే కాదు.. ఆ బతికినంత కాలం ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా, చురుగ్గా ఉండటం. మన ఆయుష్షును నిర్ణయించేది మన జన్యువుల కంటే మనం తీసుకునే ఆహారమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం దాదాపు 30 ఏళ్ల పాటు లక్ష మందిపై చేసిన సుదీర్ఘ పరిశోధనలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఏ డైట్ ఉత్తమమో తేలింది.

Secret To Aging: వ్యాధులు లేని వృద్ధాప్యం మీ సొంతం! లక్ష మందిపై జరిగిన పరిశోధనలో తేలిన నంబర్ 1 డైట్ ప్లాన్!
Best Diet For Long Life
Bhavani
|

Updated on: Jan 02, 2026 | 9:06 PM

Share

వయస్సు పైబడ్డాక కూడా ఇతరులపై ఆధారపడకుండా, జ్ఞాపకశక్తి తగ్గకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఖరీదైన మందులు అక్కర్లేదు.. మనం రోజూ తినే పళ్లెంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మెడిటరేనియన్, డాష్ (DASH) వంటి ఎనిమిది రకాల డైట్లను విశ్లేషించిన నిపుణులు.. ఒక ప్రత్యేకమైన ఆహార నియమావళి అత్యుత్తమ ఫలితాలను ఇస్తున్నట్లు గుర్తించారు. 70 ఏళ్లు దాటినా సూపర్ ఫిట్‌గా ఉండటానికి సహాయపడే ఆ ఆహార సూత్రాలు మీకోసం.

ఇటీవల ‘నేచర్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, మన ఆహారపు అలవాట్లు వృద్ధాప్యంలో మన జీవన ప్రమాణాలను శాసరిస్తాయి. 1,05,000 మందిపై మూడు దశాబ్దాల పాటు సాగిన ఈ అధ్యయనంలో ‘ఆల్టర్నేటివ్ హెల్తీ ఈటింగ్ ఇండెక్స్’ (AHEI) అనే డైట్ అత్యంత ప్రభావవంతమైనదిగా నిలిచింది.

AHEI డైట్ ప్రత్యేకతలు: ఈ ఆహార నియమావళిని పాటించే వారు క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యల బారిన పడకుండా 86 శాతం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు తేలింది. ఈ డైట్ ప్రధానంగా వీటిపై దృష్టి పెడుతుంది:

పండ్లు, కూరగాయలు: రోజూ తగినంత మోతాదులో తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి.

ముడి ధాన్యాలు: తెల్లటి అన్నం, మైదాకు బదులుగా గోధుమలు, బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటివి చేర్చుకోవాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులు: ఆలివ్ ఆయిల్, అవకాడో, చేపలు, గుడ్ల ద్వారా లభించే మంచి కొవ్వులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

గింజలు, పప్పు ధాన్యాలు: ప్రోటీన్, ఫైబర్ కోసం నట్స్, వివిధ రకాల పప్పులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

విడిచిపెట్టాల్సినవి: అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిరుతిళ్లు), శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసం, అధిక ఉప్పును పూర్తిగా తగ్గించాలి. ఇవి శరీరంలో విషతుల్యాలను పెంచి త్వరగా ముసలితనం వచ్చేలా చేస్తాయి.

“ఆయుష్షు పెరగడం అంటే కేవలం సంవత్సరాలు లెక్కపెట్టడం కాదు.. స్వతంత్రంగా, మానసిక స్పష్టతతో జీవించడం” అని హార్వర్డ్ ప్రొఫెసర్ ఫ్రాంక్ హు పేర్కొన్నారు. అందరికీ ఒకే రకమైన డైట్ సరిపోకపోవచ్చు కానీ, మొక్కల ఆధారిత ఆహారాన్ని పెంచుకుంటూ ప్రాసెస్ చేసిన పదార్థాలను దూరం పెట్టడం వల్ల ఎవరైనా ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని పొందవచ్చు.

70లోనూ 20లా ఉండాలా? హార్వర్డ్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన డైట్ ఇదే
70లోనూ 20లా ఉండాలా? హార్వర్డ్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన డైట్ ఇదే
నగ్నంగా నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందా.. అసలు నిజాలు తెలిస్తే షాక్
నగ్నంగా నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందా.. అసలు నిజాలు తెలిస్తే షాక్
రోడ్లపై కంటికి కనిపించని మృత్యువు..! అలర్ట్‌గా లేకపోతే అంతే
రోడ్లపై కంటికి కనిపించని మృత్యువు..! అలర్ట్‌గా లేకపోతే అంతే
ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?