AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన గొంతు.. అత్యంత తెలివైన మోసం.. కాకి గూటిలో కోకిల గుడ్ల వెనక షాకింగ్ సీక్రెట్స్..

కోకిల పక్షిని సోమరిగా భావిస్తుంటారు. కానీ అది సోమరితనం కాదు.. తెలివైన బ్రూడ్ పారాసిటిజం వ్యూహం. ఇది తన గూడు కట్టుకోకుండా, కాకి వంటి ఇతర పక్షుల గూళ్లలో గుడ్లు పెడుతుంది. కోకిల తన గూడును తాను ఎందుకు నిర్మించుకోదు? కాకి గూటిలో గుడ్లు పెట్టడం వెనుక ఉన్నరహస్యం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అందమైన గొంతు.. అత్యంత తెలివైన మోసం.. కాకి గూటిలో కోకిల గుడ్ల వెనక షాకింగ్ సీక్రెట్స్..
Cuckoo Bird Clever Strategy
Krishna S
|

Updated on: Jan 04, 2026 | 7:10 AM

Share

ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. ఒకవేళ ఒక్కరోజు అన్ని పక్షులు భూమి నుండి అదృశ్యమైతే ఏం జరుగుతుందో ఊహించగలరా? కీటకాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది. చెట్ల విస్తరణ ఆగిపోతుంది, పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. ప్రపంచంలో 11,000 కంటే ఎక్కువ పక్షి జాతులు ఉంటే అందులో ప్రతిదీ ఒక అద్భుతమే. అయితే వీటన్నింటిలో ఒక పక్షిని మాత్రం అందరూ సోమరి అని పిలుస్తుంటారు. ఆ పక్షి కథేంటో ఇప్పుడు చూద్దాం.

గూడు కట్టదు.. పిల్లలను సాకదు..

మనం సోమరి అని పిలుచుకునే ఆ పక్షి మరేదో కాదు.. అందమైన గొంతుతో పాడే కోకిల. ఇది ఎగరలేకనో లేదా కష్టపడలేకనో సోమరి కాలేదు. తన గూడు తాను కట్టుకోదు, తన పిల్లలను తనే పెంచదు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. కానీ శాస్త్రవేత్తల దృష్టిలో ఇది సోమరితనం కాదు.. ఇదొక అత్యంత తెలివైన బ్రూడ్ పారాసిటిజం వ్యూహం.

కాకి గూటిలో కోకిల గుడ్లు.. ప్రకృతి వింత

కోకిల తన గుడ్లను పొదగడానికి కాకి గూడును ఎంచుకుంటుంది. కాకి లేనప్పుడు తను గుడ్డు పెట్టి.. అందులో ఉన్న కాకి గుడ్లను అక్కడ నుండి పడేస్తుంది. ప్రకృతి అద్భుతం ఏంటంటే.. కోకిల గుడ్డు రంగు, ఆకారం, నమూనా అచ్చం కాకి గుడ్డులాగే ఉంటాయి. దీనివల్ల కాకి అది తన గుడ్డు కాదని గుర్తించలేక, తన సొంత పిల్లలాగే కోకిల పిల్లను కూడా సాకుతుంది.

పుట్టిన వెంటనే మొదలయ్యే పోరాటం

కోకిల పిల్ల గూడులోని ఇతర గుడ్ల కంటే ముందే బయటకు వస్తుంది. పుట్టిన వెంటనే అది చేసే మొదటి పని.. గూడులోని మిగిలిన గుడ్లను లేదా ఇతర పక్షి పిల్లలను కిందకు తోసేయడం. దీనివల్ల తల్లి పక్షి తెచ్చే ఆహారం మొత్తం తనకే దక్కుతుంది. కొద్ది రోజుల్లోనే అది కాకి కంటే పెద్దదిగా పెరిగి ఎగిరిపోతుంది.

గుడ్లు ఎలా అంతలా సరిపోతాయి?

ఇది యాదృచ్చికం కాదు.. కోకిల తాను ఏ జాతి పక్షి గూడులో పెరిగిందో, పెద్దయ్యాక అదే జాతి పక్షి గూడులోనే గుడ్లు పెడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే వాటి గుడ్లు ఒకదానికొకటి అంతలా సరిపోతాయి. ఒకవేళ గుడ్డు రంగులో తేడా వస్తే ఆతిథ్య పక్షి దానిని గుర్తుపట్టి బయటకు విసిరివేస్తుంది. అందుకే కోకిల తన గుడ్లను పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది.

ఇది కోకిల ఒక్కదానికే పరిమితమా?

కాదు! ప్రకృతిలో ఇటువంటి తెలివైన మోసాలు చాలా ఉన్నాయి. కొన్ని పక్షి జాతులే కాకుండా కొన్ని రకాల చేపలు కూడా ఇతరులను మోసగించి తమ పిల్లలను పెంచుతాయి. ప్రకృతిలో జీవించాలంటే కేవలం కష్టపడటమే కాదు తెలివితేటలు కూడా ఉండాలని కోకిల జీవితం నిరూపిస్తోంది.

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో