Viral Video: శ్మశానంలో అదేం పని భయ్యా.. పట్టపగలు సమాధులపై కూర్చొని..
సాధారణంగా బంగారం దొంగతనం చేసేవాళ్లను చూస్తుంటాం.. ఇంట్లో చొరబడి ఉన్నదంతా ఊడ్చుకునిపోయేవాళ్లని చూస్తూంటాం.. కానీ ఇక్కడో వ్యక్తి ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే మీరు నవ్వాపులోకేరు. ఎందుకంటే ఇక్కడో వ్యక్తి.. స్మశానంలో సమాధులపై ఉన్న పూలను ఎత్తుకెళ్లాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇంతకు ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

సాధారణంగా బంగారమో, డబ్బో ఎత్తుకెళ్లే వారిని మనంచూస్తుంటాం. కానీ పూలను దొంగతనం చేసేవాళ్లను మీరెప్పుడైనా చూశారా.. అది కూడా స్మశానంలో సమాధులపై ఉన్న పూలను ఎత్తుకెళ్లే వాళ్లను చూశారా. అయితే ఇప్పుడు చూడండి. తమవారి ఆత్మశాంతి కోసం జనాలు సమాధిపై పూలు పరిచి వెళ్ళిపోతుంటే.. ఓ ప్రబుద్ధుడు వాటిని ఏరుకుంటూ మూటగట్టుకోవడాన్ని స్థానికులు గమనించి ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలోని మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ శ్మశానంలో సమాధులపైన ఉన్న పూలను దొంగతనం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ సమాధిపై కూర్చుని ఆ ప్రాంతమంతా శుభ్రం చేశాడు. ఆ తర్వాత సమాధిపై ఉన్న పూలను తీసుకుని మూట గట్టుకున్నాడు. శుభ్రం చేసుకునే వరకు బాగానే ఉంది.. కానీ అక్కడ ఉన్న పూలు ఎందుకు తీసుకెళ్లాడనేది అర్థం కావట్లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
పైగా సమాధి అంటే ఒక రకంగా ఎవరైనా భయపడతారు.. అరిష్టం అని భావిస్తారు. అలాంటిది సమాధిపై ఉన్న పూలు తీసుకెళ్లడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన జనాలు ఆ వ్యక్తి ఆ పువ్వులను మళ్లీ అమ్మడు కదూ అని కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
