Coconut Water: శీతాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా.. 90 శాతం మందికి తెలియని నిజాలివే!
కొబ్బరి నీరు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని అందిరికీ తెలిసిన విషయమే. అయితే, శీతాకాలంలో కొబ్బరి నీరు తాగొచ్చా, లేదా అనే విషయంలో చాలా మంది తరచుగా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కాబట్టి వైద్య నిపుణుల ప్రకారం శీతాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగడం సురక్షితమా, లేదా ఇక్కడ తెలుసుకుందాం.

శీతాకాలంలో మనం తరచుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల మనం ఊరిగే సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటిని ఎదుర్కొంటాం. అలాంటి సమయంలో మనం ఆరోగ్యంగా భావించే కొబ్బరి నీటిని తాగుతూ ఉంటాం. అయితే ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏమిటంటే శీతాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యకరమా కాదా అని. ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణులు చెప్పే సమాధానం ఏమిటంటే.. సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకుంటే, శీతాకాలంలో కూడా కొబ్బరి నీరు శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి ప్రయోజనకరమైనవి అయినప్పటికీ.. ఈ విషయం తెలియక చాలా మంది శీతాకాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల జలుబు వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని వాటిని దూరం పెడతారు.
శీతాకాలంలో కొబ్బరి నీటి ప్రయోజనాలు
శీతాకాలంలో, మనం చాలా తక్కువ నీటిని తాగుతాం. దీని కారణంగా మన శరీరం నిర్జలీకరణానికి దారితీస్తుంది. కాబట్టి కొబ్బరి నీరు తాగడం వల్ల అది శరీరాన్ని లోపలి నుండి పోషించడానికి సహజంగా ద్రవాలను నింపుతుతంది. కొబ్బరి నీటిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో సంభవించే కండరాల దృఢత్వం, అలసట నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా, దానిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి, సాధారణ జలుబు వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో మీకు సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: డయాబెటీస్ రోగులు ఎగిరిగంతేసే టిప్.. రైస్ ఇలా వండితే.. అన్నం తిన్నా షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు!
శీతాకాలంలో కొబ్బరి నీళ్లు తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అయితే, శీతాకాలంలో కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.శీతాకాంలో ఉదయం లేదా రాత్రిపూట కొబ్బరి నీరు తాగకండి. మీకు దగ్గు, ఉబ్బసం లేదా సైనస్ సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించకుండా కొబ్బరి నీరు తాగవద్దు. మీరు కొబ్బరి నీటి ప్రయోజనాలను పొందాలంటే మధ్యాహ్నం, లేదా ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో తాగండి. ఈ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి:అల్లం వాడేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! లేదంటే తిన్నా వేస్టే!
ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్ ఇదేనట.. దీన్ని ఎవరు వాడారో తెలుసా?
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
