AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger Usage Tips: అల్లం వాడేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! లేదంటే తిన్నా వేస్టే!

Ginger Mistakes to Avoid : అల్లం ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించే ఆహార పదార్థాలలో ఒకటి. దీనిలో ఉండే ఔషధ గుణాలు కారణంగా దీనిని ప్రజలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మనం ఎక్కువగా టీ, వంటకాల్లో ఎక్కువగా వాడుతాం. అయితే, ఇక్కడ చాలా మందికి అల్లంను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియదు. దీనివల్ల వారు అల్లం పూర్తి ప్రయోజనాలను పొందలేకపోతారు. కాబట్టి అల్లం వాడేప్పుడు చేయకూడని తప్పులు ఏంటో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jan 03, 2026 | 4:25 PM

Share
అల్లంను ఎక్కువసేపు ఉడికించడం: చాలా మంది చేసే పెద్దతప్పు ఏంటంటే.. మనం టీ లేదా ఇతర వంటకాల్లో అల్లం వాడేప్పుడు దాన్ని ఎక్కువ సమయం ఉడికించడం. ఇలా చేయడం ద్వారా దానిలోని అనేక సహజ పోషకాలు నాశనం అవుతాయి. దీని వలన అల్లం రుచి, ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి. కాబట్టి మీరు అల్లంను ఎక్కవ సమయం వేయించకండి.. దాన్ని తేలికగా వేయించినా మీరు దాని ప్రయోజనాలను పొందవచ్చు.

1 / 5
ఒకేసారి ఎక్కువ అల్లం వాడటం: ఎక్కువ అల్లం వాడతే ఎక్కవ ప్రయోజనాలు లభిస్తాయని అనుకుంటారు చాలా మంది. అందుకే కూరల్లో అవసరానికి మించిన అల్లాన్ని వేస్తుంటారు. కానీ ఇలా చేయడం ద్వారా కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వంటకాలు చేడిపోవచ్చు కూడా. కాబట్టి ఆమ్లత్వం లేదా ఇతర సమస్యలను నివారించడానికి అవసరమైన మేర అల్లాన్ని వంటకాల్లో వాడడండి.

2 / 5
పాత లేదా ఎండిన అల్లం వాడటం: చాలా మంది అల్లం తెచ్చి ఎక్కువ రోజులు అలాగే పెడతారు. అప్పుడు అది ఎండిపోతుంది. అయితే కొన్ని సార్లు దాన్ని అలానే వంటకాల్లో వాడుతుంటారు. ఇలా చేయడం తప్పు. ఎండిన అల్లంలో పోషకాలు తగ్గుతాయి. అల్లం కాలక్రమేనా దాని తేమ, వాసన, శక్తిని కోల్పోతుంది. ఎండిన అల్లం వాడటం వల్ల వంటకం రుచి, పోషకాలు తగ్గుతాయి. అందువల్ల, ఉత్తమ ఫలితాల కోసం, ఎల్లప్పుడూ తాజా అల్లం వాడండి. అలాగే, దానిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి సరిగ్గా నిల్వ చేయండి.

3 / 5
అల్లం తొక్క ఎక్కువ తీయడం: చాలా మంది అల్లంను క్లీన్ చేసేప్పుడు దాని తొక్కను లోతుగా తీస్తారు, ఇలా చేయడం కారణంగా తొక్కతో పాటు అల్లం గుజ్జును కూడా పోతుంది. వాస్తవానికి, అత్యంత రుచికరమైన పోషకాలు అన్ని అల్లం తొక్కకు దగ్గరగా ఉన్న భాగంలో ఉంటాయి. కానీ మీరు ఆ భాగాన్ని మొత్తం తీసేయడం వల్ల దాని ప్రయోజనాలను పొందలేరు. కాబట్టి తొక్కను సున్నితంగా తొలగించడానికి చెంచా లేదా గరిటెను ఉపయోగించడం మంచిది. ఇది పోషకాలను సంరక్షిస్తుంది. అల్లం గుజ్జు అధికంగా వృధా కాకుండా నిరోధిస్తుంది.

4 / 5
సరైన సమయంలో అల్లం వేయకపోవడం: చాలా మందికి  వంటకాల్లో అల్లం ఎప్పుడు వేయాలో అస్సలు తెలియదు. మీరు వంటచేప్పుడు తొలుత అల్లం వేస్తే దాని ప్రత్యేకమైన రుచిని కోల్పోతారు. లేదా వంట చివర్లలో వేస్తేఏ అది వంటి రుచిని నాశనం చేస్తుంది. కాబట్టి వంట చేసేప్పుడు తొలుత కాకుండా,అటు చివర కాకుండా సరైన సమయంలో వేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా వంటకానికి రిఫ్రెషింగ్, ఆహ్లాదకరమైన వేడి వాసనను ఇస్తుంది.( NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి!

5 / 5