AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

indoor plants: ఈ మొక్కలతో అందం, ఆరోగ్యం.. ఇంట్లో పెట్టుకుంటే చెప్పలేనన్ని లాభాలు!

Best Indoor Plants: చాలా మందికి ఇంట్లో మొక్కలు పెంచుకునే అలవాటు ఉంటుంది. ఇలా మొక్కలను పెంచుకోవడం ద్వారా ఇల్లు అందంగా కనిపించడంతో పాటు మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోలో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని మొక్కలు ఇంట్లో పెంచుకోవడం ద్వారా మనం వాటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jan 03, 2026 | 5:02 PM

Share
మీ ఇల్లు అందాన్ని పెంచే,  ఇంట్లో వేగంగా పెరిగే మొక్క కోసం మీరు చూస్తుంటే.. ఎరికా మొక్క మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఇది చాలా త్వరగా పెరుగుతుంది. అలాగే దీనికి ఎక్కువ సూర్యకాంతి కూడా అవసరం లేదు. దీన్ని మీరు తక్కువ లైట్ ఉన్న ప్రదేశంలో కూడా ఉంచుకోవచ్చు.

1 / 5
ఇంట్లో పెంచుకునే మొక్కల విషయానికి వస్తే, పీస్ లిల్లీ ఒక గొప్ప ఎంపిక. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే.. దీనికి నీరు తగ్గితే అది మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. అది కాస్తా వాడిపోయినట్టు కనిపిస్తే మీరు దానికి వెంటనే నీరు పోయాలని అర్థం. మీరు నీరు పోసిన కొద్ద గంటల్లోనే అది సాధారణ స్థితికి వస్తుంది. ఇది ఇంట్లో చాలా ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

2 / 5
స్పైడర్ మొక్క: ఇంట్లో పెంచుకునేందుకు అనువైన మొక్కల్లో స్పైడర్ కూడా ఒకటి.ఈ మొక్క దాని ఆకులను సాలెపురుగుల వలె విస్తరిస్తుంది. అందుకే దీన్ని స్పైడర్ మొక్క అంటారు. దీన్ని కుండలో ఉంచి మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీన్ని  ఒకసారి నాటితే చాలా కాలం పాటు చిన్న మొక్కలను ఉత్పత్తి చేస్తుంది. ఇలా మీరు ఈ మొక్కను ఇంటి వరండాలో లేదా కిటికీ దగ్గర లేదా మీ బాల్కనీలో వేలాడదీయవచ్చు.

3 / 5
ZZ మొక్క: దీన్నే జాంజిబార్ రత్నం అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. ఈ మొక్క పూర్తిగా పెరిగిన తర్వాత ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ మొక్కను పెంచడం కూడా చాలా ఈజీ. ఇది తక్కువ కాంతిలో కూడా బాగా పెరుగుతుంది. దీనికి మిగతా మొక్కల్లా డేయిలీ వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు.

4 / 5
ఇంట్లో పెంచుకునేందుకు మరో అద్భుతమైన మొక్క హార్ట్-లీఫ్ ఫిలోడెండ్రాన్‌. ఈ మొక్క కూడా చాలా వేగంగా పెరుగుతుంది. ఈ మొక్కకు కూడా ఎక్కవ కాంతి అవసరం లేదు. దీన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఇంటికి అందం పెంచడంతో పాటు ఇంట్లోని గాలిని కూడా శుద్ధి చేస్తుంది. మీ ఆరోగ్యానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఇంటి అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.

5 / 5