Tollywood: ఒకప్పటి నందమూరి హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూశారా.? ఎంతలా మారిపోయాడో తెలుసా..
సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా ఎంతోమంది.. ఆ కుటుంబం నుంచి వచ్చి తెలుగులో స్టార్ హీరోలుగా నిలిచారు..
టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా ఎంతోమంది.. ఆ కుటుంబం నుంచి వచ్చి తెలుగులో స్టార్ హీరోలుగా నిలిచారు. మరి అదే కుటుంబం నుంచి వచ్చిన ఓ హీరో గురించి ఇప్పుడు చాలామంది మర్చిపోయారు. అప్పట్లో వరుసపెట్టి సినిమాలు చేసిన ఆయన.. ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇంతకీ ఆయనెవరో తెలుసా.? మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి.
1986లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాగతం’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈయన ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమరావు కొడుకు. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ చక్రవర్తి.. ఏడాదిలో వరుసగా రెండు సినిమాలు.. ఆ తర్వాత నాలుగు.. అలా పెంచుకుంటూ.. బిజీ హీరోగా మారిపోయారు. ‘ఆత్తగారు స్వాగతం’, ‘అత్తగారు జిందాబాద్’, ‘మామా కోడళ్ళ సవాల్’, ‘ఇంటిదొంగ’, ‘అక్షింతలు’, ‘కృష్ణలీల’, ‘రౌడీ బాబాయ్’, ‘దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇలా వరుసగా సినిమాలు చేసిన కళ్యాణ్ చక్రవర్తి.. చివరిసారిగా 2003లో వచ్చిన ‘కబీర్ దాస్’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అందుకు కారణం కళ్యాణ్ చక్రవర్తి తండ్రి. సహా కొడుకు పృథ్వి. ఓ రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ చక్రవర్తి తన తమ్ముడు హరీన్ చక్రవర్తి , కొడుకు పృథ్వి ప్రాణాలు కోల్పోయారు. అదే యాక్సిడెంట్ లో కళ్యాణ్ చక్రవర్తి తండ్రి త్రివిక్రమరావు గాయాలతో బయటపడ్డారు. ఆ యాక్సిడెంట్ కల్యాణ్‌కు పెద్ద షాక్. అందులో నుంచి ఆయన తేరుకోలేకపోయారు. దీంతో నటనకు గుడ్ బై చెప్పి.. గాయపడిన తండ్రిని చూసుకుంటూ.. చెన్నైలోనే ఉండిపోయారు కళ్యాణ్ చక్రవర్తి. ఇక తండ్రి మరణించిన అనంతరం కూడా ఆయన చెన్నైని వదిలి పెట్టలేదు. అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయారు. ఇటీవల తారకరత్న అంత్యక్రియలకు ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఇక ఆయనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.