Kadapa: బాలుడి కలలోకి వచ్చిన దైవం.. వెళ్లి ఆ పుట్టను తవ్వమన్నాడు.. అలా చేసేసరికి..
కడప జిల్లా ఒంటిమిట్టలో కలతో మొదలైన కథ… గుట్టకింద పుట్ట వద్ద వెలుగుచూసిన విగ్రహాలతో సంచలనంగా మారింది. బాలుడి కలను దైవవాక్కుగా నమ్మిన గ్రామస్తులు పుట్టను తవ్వగా పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అయితే ఇది దైవ సంకేతమా? లేక ముందే రూపొందించిన డ్రామానా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కడప జిల్లా ఒంటిమిట్టలో వింత ఘటన వెలుగుచూసింది. కొనరాజుపల్లిలో ఓ బాలుడి కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఊరు శివారులోని గుట్టకింద పుట్టలో తానున్నట్లు ఆ బాలుడితో దేవుడు చెప్పాడట. దీంతో ఆ బాలుడు ఈ మాటల్ని గ్రామస్థులకు తెలిపాడు. దీంతో ఊరు జనమంతా మాట్లాడుకుని వెళ్లి ఆ పుట్టను పెకిలించారు. దీంతో నిజంగా ఆశ్చర్యంగా కలిగించేలా..అక్కడ 3 పంచలోహ విగ్రహాలు వెలుగుచూశాయి. నరసింహస్వామి, హనుమాన్, లక్ష్మిదేవి విగ్రహాలు అక్కడ లభ్యమయ్యాయి. మరో రెండు విగ్రహాలు కూడా ఉన్నట్లు బాలుడు చెబుతున్నాడు. ఈవిషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో జనం పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. విగ్రహాలను దర్శించి.. పూజలు చేస్తున్నారు. దైవవాక్కుగా భావించి బాలుడ్ని సైతం దైవాంశ సంభూతుడిగా పేర్కొంటున్నారు. అయితే గ్రామంలో కొందరి నుంచి మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. అంతా ప్రీప్లాన్ చేసి.. డ్రామాగా అల్లారని.. ఇదంతా ట్రాష్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరి ఆ దైవానికే అసలు నిజం తెలియాలి.
వీడియోలు దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
