ఆపిల్స్ ను అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే ధరలే కాస్త అందనంత దూరంలో ఉంటాయి. కానీ రోజూ ఒక ఆపిల్ ను తీసుకోవడం వల్ల వైద్యుడి దగ్గరకు వెళ్లవలిసిన అవసరమే లేదన్న నానుడి కూడా మనందరికీ తెలిసిందే
TV9 Telugu
ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోనాలు ఉండటమే అందుకు కారణం. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఖనిజాలతో పాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయి
TV9 Telugu
క్యాలరీలు తక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండే ఆపిల్స్ బరువు తగ్గేందుకు ఎంతో తోడ్పడతాయి. ఈ పండులో ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆకలిని నియంత్రించి కడుపు నిండిన భావన కలిగిస్తుంది
TV9 Telugu
ఆపిల్ జ్యూస్, ఫ్యూరీ వంటి వాటి కంటే పూర్తి ఆపిల్ ను నేరుగా తీసుకోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆపిల్ లో ఫైబర్ తో పాటు క్వెర్సిటిన్, ఎపికాటెచిన్ అనే ఫినోలిక్ రసాయన ఆమ్లాలు కూడా ఉంటాయి
TV9 Telugu
ఇవి ధమనుల గోడలపై కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడతాయి. దీంతో రక్తప్రసరణ సాఫీగా సాగి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయంలో రాళ్లకు కారణం అవుతాయి
TV9 Telugu
ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడాన్ని నివారించవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ప్రేగులల్లో కదలికలు సాఫీగా జరిగి మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి
TV9 Telugu
ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆపిల్స్ లో పాలీశాకరైడ్ పెక్టిన్ ఉంటుంది
TV9 Telugu
ఇది శరీరం నుంచి విష పదార్థాలను, చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఆపిల్స్ కాలేయాన్ని శుభ్రం చేసి వ్యర్థాలను సహజంగా బయటకు పంపిస్తుంది