చిన్న అల్లం ముక్కతో.. ఆరోగ్య సోపానాలు!
04 January 2026
TV9 Telugu
TV9 Telugu
వంటకాలకు ప్రత్యేక రుచిని ఇచ్చే అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని ఉన్నాయ్. కాస్తంత అల్లం నూరి చాయ్‌లో మరిగించి తాగితే.. ఆహా ఆ వాసనా, రుచీ అమోఘమే
TV9 Telugu
అల్లం మురబ్బా తింటే జలుబూ..గిలుబూ బలాదూర్. ఆహారం రుచిని పెంచే అల్లం పోషకాల్లోనూ నంబర్‌వన్..
TV9 Telugu
అల్లంలోని ఘాటైన సుగంధ తైలాలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆహారం వల్ల జీర్ణ వ్యవస్థకు వచ్చే ఇబ్బందులని తగ్గిస్తాయి
TV9 Telugu
అల్లానికి రక్తంలో కొవ్వుని తగ్గించే గుణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు అల్లం లేదా శొంఠిరసాన్ని ఇస్తే జలుబు ఇట్టే తగ్గుతుంది
TV9 Telugu
ఇది జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్య రాదు. వేళకు ఆకలి వేస్తుంది. వాంతులు, వికారం తగ్గుతాయి. రక్తప్రసరణ బాగు చేస్తుంది
TV9 Telugu
అల్లంరసంలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గుతాయి
TV9 Telugu
పైగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డయాబెటీస్‌తో బాధపడేవారు అల్లం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది
TV9 Telugu
రక్తపోటు అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. బరువూ తగ్గొచ్చు. చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు పరార్ అవుతాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
తళతళ తమలపాకుతో పసందైన ఆరోగ్యం.. అతిచేస్తే క్యాన్సర్ పక్కా!
జ్వరం వచ్చినప్పుడు కాఫీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి