AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఈ రోజుల్లో జాగ్రత్త..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు డిసెంబర్ స్థాయికి పడిపోతాయి. ఉదయం దట్టమైన పొగమంచు, మబ్బులు ఆవరించనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ఉన్ని దుస్తులు ధరించి, శ్వాస సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో పొగమంచు లైట్లు వాడాలని సూచించారు. చలి ఏ రోజుల్లో ఎక్కువగా ఉంటుందంటే..?

Telangana: వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఈ రోజుల్లో జాగ్రత్త..
Coldwave Alert In Telugu States
Krishna S
|

Updated on: Jan 04, 2026 | 10:30 PM

Share

గత కొద్ది రోజులుగా చలి నుంచి స్వల్ప ఉపశమనం పొందుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్‌లో వణికించిన చలి తీవ్రత మళ్లీ మొదలుకానుంది. జనవరి 5 నుంచి 12 వరకు రెండో విడత శీతల గాలులు బలంగా వీయనున్నాయని హెచ్చరించారు. రానున్న వారం రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. డిసెంబర్ నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలకు సమానంగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది.

సాధారణంగా ఎండ ప్రభావం ఉండే మధ్యాహ్న సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు కేవలం 25-26 డిగ్రీలకే పరిమితం కావచ్చు. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మేయనుంది. దీనివల్ల రహదారులపై విజిబిలిటీ తగ్గి వాహనదారులకు ఇబ్బందులు కలగవచ్చు. ఆకాశం పూర్తిగా మబ్బులతో నిండి ఉంటుంది. దీనివల్ల సూర్యరశ్మి తక్కువగా ఉండి రోజంతా చలి వాతావరణం కొనసాగుతుందని బాలాజీ తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.

తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్ధులు పొగమంచు సమయంలో బయటకు రాకపోవడమే మంచిది. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనదారులు ఫాగ్ లైట్లు వాడుతూ, తక్కువ వేగంతో ప్రయాణించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని చలి నుంచి సేఫ్‌గా ఉండండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..