AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D Mart: డీ మార్ట్‌ను మించి డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో అదిరే ఆఫర్లు.. అతి తక్కువ ధరకే..

బడ్జెట్ షాపింగ్ అంటే కేవలం డీ-మార్ట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. గతంలో మాదిరి డీమార్ట్ మాత్రమే అనే రోజులు పోయాయి. అనేక ఆన్‌లైన్ క్విక్ కామర్స్ యాప్‌లు, ఇతర రిటైల్ స్టోర్‌లు ఇప్పుడు బడ్జెట్ షాపింగ్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి. డీ మార్ట్‌కు పోటీగా మంచి డిస్కౌంట్స్ లభించే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

D Mart: డీ మార్ట్‌ను మించి డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో అదిరే ఆఫర్లు.. అతి తక్కువ ధరకే..
D Mart Alternatives For Grocery
Krishna S
|

Updated on: Jan 04, 2026 | 8:12 PM

Share

సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ షాపింగ్ అనగానే గుర్తొచ్చే పేరు డీ-మార్ట్. అయితే మారుతున్న కాలంతో పాటు షాపింగ్ ముఖచిత్రం కూడా మారిపోయింది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన పలు క్విక్ కామర్స్ యాప్స్, రిటైల్ స్టోర్లు డీ-మార్ట్‌కు గట్టి పోటీనిస్తూ కొన్ని ఉత్పత్తులపై అంతకంటే ఎక్కువ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. కేవలం ధర మాత్రమే కాకుండా ఇంటి వద్దకే డెలివరీ చేసే సౌకర్యంతో ఇవి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

ఆన్‌లైన్ రంగంలో ఆఫర్ల సునామీ

జియో మార్ట్: ప్రస్తుతం డీ-మార్ట్‌కు ప్రధాన ప్రత్యర్థిగా జియో మార్ట్ నిలుస్తోంది. కొన్ని రకాల ఉత్పత్తులపై ఎంఆర్‌పీ కంటే 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. బల్క్ ఆర్డర్లపై ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడమే కాకుండా ఉచిత డెలివరీ సౌకర్యం కూడా ఉండడం వినియోగదారులకు ప్లస్ పాయింట్.

బ్లింకిట్: సమయం ఆదా చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. కేవలం 10 నుండి 30 నిమిషాలలోనే వస్తువులను డెలివరీ చేస్తూ ధరల విషయంలోనూ డీ-మార్ట్‌కు ధీటుగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్కెట్: నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే వారు బిగ్ బాస్కెట్‌ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వీటి ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులపై 11-12శాతం డిస్కౌంట్స్ లభిస్తాయి. మెట్రో నగరాల్లో ఆర్గానిక్ వస్తువుల కోసం ఇది సరైన వేదిక.

అమెజాన్ – ఫ్లిప్‌కార్ట్: పండుగ సీజన్లలో ఈ దిగ్గజాలు కిరాణా సామాగ్రిపై భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. పాయింట్లు మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా వినియోగదారులు అధిక లాభం పొందవచ్చు.

ఆఫ్‌లైన్‌లో డీ-మార్ట్‌కు ప్రత్యామ్నాయాలు

విశాల్ మెగా మార్ట్: బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్‌కు ఇది కేరాఫ్ అడ్రస్. కిరాణా సామాగ్రితో పాటు దుస్తులు, గృహోపకరణాలపై కూడా ఇక్కడ భారీ డిస్కౌంట్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీటి ధరలు డీ-మార్ట్ కంటే తక్కువగా ఉండడం విశేషం.

రిలయన్స్ స్మార్ట్: ఉత్పత్తుల శ్రేణి ఎక్కువగా ఉండటంతో పాటు స్టోర్ల నిర్వహణ చాలా శుభ్రంగా ఉంటుంది. వీరు అందించే Buy 1 Get 1 ఆఫర్లు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తాయి.

మెట్రో హోల్‌సేల్: ఎవరైతే బల్క్ షాపింగ్ చేయాలనుకుంటారో వారికి మెట్రో వంటి స్టోర్లు అత్యంత తక్కువ ధరలకు సరుకులను అందిస్తాయి.

ఒకప్పుడు తక్కువ ధరలకు డీ-మార్ట్ మాత్రమే దిక్కు అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. వినియోగదారులు స్మార్ట్‌గా ఆలోచించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోని ఆఫర్లను పోల్చి చూసుకుంటే, నెలకు కిరాణా సామాగ్రిపై కనీసం 20 నుండి 30 శాతం వరకు ఆదాయాన్ని ఆదా చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాక్ బౌలర్ కవ్వింపులకు విండీస్ వీరుడి గట్టి వార్నింగ్
పాక్ బౌలర్ కవ్వింపులకు విండీస్ వీరుడి గట్టి వార్నింగ్
చలికాలం చిలగడదుంప తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
చలికాలం చిలగడదుంప తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
కేంద్రం కీలక నిర్ణయం.. వాట్సాప్‌లో ఉచిత న్యాయ సహాయ సేవ..
కేంద్రం కీలక నిర్ణయం.. వాట్సాప్‌లో ఉచిత న్యాయ సహాయ సేవ..
అందరు హీరోలంటే ఇషం.. ఆయన సినిమాను మళ్లీ మళ్లీ చూస్తా..
అందరు హీరోలంటే ఇషం.. ఆయన సినిమాను మళ్లీ మళ్లీ చూస్తా..
చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
అక్కడ స్టార్ లింక్ ఇంటర్నెట్ ఫ్రీ.. మస్క్ ఆఫర్ అదిరింది
అక్కడ స్టార్ లింక్ ఇంటర్నెట్ ఫ్రీ.. మస్క్ ఆఫర్ అదిరింది
ఐపీఎల్ చూడకండి.. ప్రజలకు బంగ్లా సర్కార్ షాకింగ్ ఆర్డర్
ఐపీఎల్ చూడకండి.. ప్రజలకు బంగ్లా సర్కార్ షాకింగ్ ఆర్డర్
ఈ రోజుల్లో గోర్లు కట్ చేస్తున్నారా? ఇక దరిద్రం మీతోనే!
ఈ రోజుల్లో గోర్లు కట్ చేస్తున్నారా? ఇక దరిద్రం మీతోనే!
ఈ నల్లటి విత్తనాలు మైగ్రేన్‌ నొప్పికి రామబాణం..! పోషకాలు, లాభాలు
ఈ నల్లటి విత్తనాలు మైగ్రేన్‌ నొప్పికి రామబాణం..! పోషకాలు, లాభాలు
వెండి ధరలపై షాకింగ్ న్యూస్.. ఆల్ టైం రికార్డ్ స్థాయికి..
వెండి ధరలపై షాకింగ్ న్యూస్.. ఆల్ టైం రికార్డ్ స్థాయికి..