అయ్యో భగవంతుడా.. తండ్రి ఫొటో వద్ద రోదిస్తూ ప్రాణాలు విడిచిన కూతురు..
తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నాన్న మృతితో కుమార్తె తల్లడిల్లిపోయింది. దశదిన కర్మ రోజు తండ్రి చిత్రపటం వద్ద రోదిస్తూ కూతురు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తండ్రి-కూతుళ్ల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది.. తండ్రికి కూతురంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తండ్రికి తన కూతురు మరో అమ్మ అయితే.. ఆ కూతురికి తండ్రి ఒక హీరో. తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నాన్న మృతితో కుమార్తె తల్లడిల్లిపోయింది. దశదిన కర్మ రోజు తండ్రి చిత్రపటం వద్ద రోదిస్తూ కూతురు ప్రాణాలు విడిచింది.
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లికి చెందిన సోమయ్య, కొండమ్మ దంపతులకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కూలీనాలి చేస్తూ నలుగురికి వివాహం చేయగా, దివ్యాంగురాలైన కూతురు తనతోపాటే ఉంటుంది. మూడో కుమార్తె కోడూరి రమణమ్మ(35) కు వివాహమైన కొన్ని నెలలకే భర్త మరణించాడు. దీంతో ఆమె దివ్యాంగురాలైన సోదరి, తల్లిదండ్రులతో కలిసి మాడ్గులపల్లిలో జీవిస్తోంది. మూడేళ్ల క్రితం తల్లి కొండమ్మ మృతి చెందింది. అప్పటి నుంచి దివ్యాంగురాలైన సోదరి, తండ్రికి రమణమ్మ దిక్కయింది.
అనారోగ్య సమస్యలతో తండ్రి సోమయ్య గత నెలలో మరణించాడు. ఆయన చనిపోయిన రోజే రమణమ్మ అస్వస్థతకు గురికాగా, బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తండ్రి దశదినకర్మకు బంధువులంతా వచ్చారు. తనను అపురూపంగా చూసుకున్న తండ్రి ఇక లేడని.. తండ్రి చిత్రపటాన్ని పట్టుకొని రోదిస్తూ రమణమ్మ గుండెపోటుకి గురై చనిపోయింది.
ఈ దృశ్యం స్థానికులను కలిచివేసింది. సోదరికి దివ్యాంగురాలైన సునీత తలకొరివి పెట్టడం పలువురికి కన్నీరు తెప్పించింది. దినకర్మకు వచ్చిన బంధువులంతా ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడంతో మాడ్గులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
