AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆడపిల్ల పుడితే రూ.5000.. ఆదర్శంగా సర్పంచ్ భరోసా.. ఎక్కడంటే..?

కొదురుపాక సర్పంచ్ మంజుల సుధాకర్ ఆడపిల్లల భవిష్యత్తుకు సరికొత్త ఒరవడిని సృష్టించారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో పుట్టే ప్రతి ఆడబిడ్డ పేరున రూ.5,000 సుకన్య సమృద్ధి యోజన కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఆడపిల్ల భారమనే భావనను తొలగించి, వారి విద్య, వివాహాలకు అండగా నిలిచే ఈ కార్యక్రమం సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది.

Telangana: ఆడపిల్ల పుడితే రూ.5000.. ఆదర్శంగా సర్పంచ్ భరోసా.. ఎక్కడంటే..?
Girl Child Financial Aid
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 05, 2026 | 7:15 AM

Share

ఆడపిల్ల పుడితే భారమని భావించే రోజులకు కాలం చెల్లింది. ఆడబిడ్డ పుడితే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరాలు చేసుకునేలా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామ సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సమాజంలో వేళ్లూనుకున్న వివక్షను దూరం చేస్తూ సామాజిక మార్పు కోసం కొదురుపాక సర్పంచ్ భరోసా అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా మానవీయ కోణంలో ఆలోచించిన సర్పంచ్ దంపతులు.. తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో ఎవరు ఆడపిల్ల పుట్టినా తమ సొంత నిధుల నుండి రూ. 5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఈ అకౌంట్లను తెరిపించి ఆ పాస్ బుక్కులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.

నూతన సంవత్సర కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్, గ్రామానికి చెందిన తిరుమలేష్-గౌతమి దంపతులకు పుట్టిన ఆడబిడ్డ పేరు మీద రూ. 5,000 డిపాజిట్ చేసి ఆ పాస్ బుక్కును స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల చదువు, వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదని అన్నారు. తాము చేసే ఈ చిన్న పొదుపు, ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యే సరికి కొండంత అండగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆలోచనా విధానంలో మార్పు రావడమే తమ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్న మంజుల సుధాకర్ దంపతులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జిల్లాలోని ఇతర గ్రామాలకు కూడా ఈ నిర్ణయం ఒక దిక్సూచిగా నిలుస్తుందని స్థానికులు కొనియాడుతున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిన సర్పంచ్ దంపతుల చొరవ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..