బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..  హిట్ కోసం ఎదురుచూపులు.. 

3 January 2026

Pic credit - Instagram

Rajeev 

హైదరాబాదీ అమ్మాయి ఫరియా అద్బుల్లా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. 

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ పొడుగుకాళ్ల సుందరి.. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. 

ఆ సినిమాలో చిట్టి పాత్రలో ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ బ్యూటీకి అంతగా సక్సెస్ లు రాలేదు. 

హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ కూడా చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ సక్సెస్ అందుకోలేకపోతుంది. 

మొన్నామధ్య వచ్చిన మత్తువదలరా 2 సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. కానీ ఆతర్వాత మళ్లీ ఫ్లాప్స్ పలకరించాయి. 

అల్లరి నరేష్ తో చేసిన ఆ ఒక్కటీ అడక్కు.. రీసెంట్ గా వచ్చిన గుర్రం పాపిరెడ్డి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. 

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.