Weight Loss: 2026లో బరువు తగ్గే ప్లాన్‌లో ఉన్నారా?.. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే.. రిజల్ట్ పీక్స్ అంతే!
న్యూ ఇయర్ వచ్చేసింది. చాలా మంది కొత్త సంవత్సరం రెసెల్యూషన్ లో భాగంగా బరువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా 2026లో ఫ్యాట్ లాస్ జెర్నీని స్టార్ట్ చేస్తే.. ఈ వార్త మీకోసమే.. మీరు 2026 లో బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే, మీ లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఉదయం ఖాళీ కడుపుతో తినే ఆహారం మీ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, ఈ ఆహారాలను మీరు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు.

మనం రోజంతా తినేవి, త్రాగే ఆహారాలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. మనం ఉదయం లేచిన వెంటనే తీసుకునే కొన్ని ఆహారాలు మన శరీరంలో కొవ్వును కరిగించడంతో, బరువును నియంత్రిండంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫిట్‌నెస్ నిపుణురాలు నేహా పరిహార్ తన ఇన్‌స్ట్రా గ్రామ్ పోస్ట్‌లో బరువు తగ్గించుకునేందుకు ఉదయం ఖాళీ కడుపుతో తినే కొన్ని ఆహారాల గురించి వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం ఖాళీ కడపుతో వీటిని తింటే బరువు తగ్గొచ్చు!
నానబెట్టిన బాదం, వాల్‌నట్స్: ఫిట్‌నెస్ కోచ్ ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం, వాల్‌నట్ తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. బాదం, వాల్‌నట్‌లు రెండింటో ప్రోటీన్, ఫైబర్ వంటి మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి మనకు తక్షణ శక్తిని ఇందిస్తాయి. ఇవి ఎక్కవ సమయం కడుపు నిండిన అనుభూమి ఇస్తాయి. దీనికి కారణంగా మనం ఎక్కవ తినడం ఆపేస్తాం.
ఇది కూడా చదవండి: డయాబెటీస్ రోగులు ఎగిరిగంతేసే టిప్.. రైస్ ఇలా వండితే.. అన్నం తిన్నా షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు!
ఉసిరి నీళ్లు : ఖాళీ కడుపుతో ఉసిరి నీరు తాగడం వల్ల మీ శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు లభిస్తాయి, ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి:అల్లం వాడేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! లేదంటే తిన్నా వేస్టే!
బ్రెజిల్ గింజలు: సెలీనియం, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే బ్రెజిల్ గింజలను ఖాళీ కడుపుతో తినడం చాలా మంచిది. వీటిని తినడం వల్ల జీవక్రియ మెరుపడుతుంది. థైరాయిడ్ పనితీరుకు మెరుగుపరుస్తాయి. హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. మీ డేను ఉత్సాహంగా ప్రారంభించడానికి నీటితో లేదా నానబెట్టిన బాదం వంటి ఇతర ఆరోగ్యకరమైన వాటితో వీటిని తినండి.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్ ఇదేనట.. దీన్ని ఎవరు వాడారో తెలుసా?
పసుపు, నల్ల మిరియాలు నీరు: పసుపు, నల్ల మిరియాలు కలిపిన గోరువెచ్చని నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు. ఈ డ్రింక్ మీ జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పసుపు, నల్ల మిరియాలు రెండూ అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ నీరు మీ మొత్తం ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా.. 90 శాతం మందికి తెలియని నిజాలివే!
చియా సీడ్ వాటర్: చియా గింజల నీటిని ఖాళీ కడుపుతో తాగడం బరువు తగ్గడానికి సులభమైన మార్గం. ఇది కొవ్వును నేరుగా కరిగించకపోయినా.. ఆకలిని అణచివేయడంలో, జీర్ణక్రియకు మెరుగుపర్చడంలో సూపర్బ్‌గా పనిచేస్తుందట. ఇది కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి, మెరిసే చర్మానికి చియా గింజల నీరు అద్భుతంగా పని చేస్తుంది. ఈ పైన పేర్కొన్న అదు ఆహారాలను మీరు డెయిలీ 90 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మార్పును గమనించవచ్చని ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్నారు.
View this post on Instagram
NOTE: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
