బీరకాయతో బంపర్ బెనిఫిట్స్..! తరచూ మీ డైట్‌లో చేర్చుకుంటే కలిగే లాభాలివే..
ప్రతి ఒక్కరూ ఇంట్లో బీరకాయ కూర తినే ఉంటారు. ఇది ప్రతి ఇంట్లోనూ ఒక సాధారణ వంటకం. కానీ, కొందరు మాత్రం ఈ కూరగాయలను చూడగానే ముఖం చిట్లించుకుంటారు.. ఎందుకంటే దాని ప్రయోజనాల గురించి వారికి తెలియదు. కాబట్టి. బీరకాయలో ఉండే పోషకాలు, తరచూ తినటం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తప్పక తెలుసుకోవాలి.

బీరకాయలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. ఇవి మీకు శక్తి సమతుల్యతను, శారీరక బలాన్ని అందిస్తాయి. ఇది అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉన్న ఆకుపచ్చ కూరగాయ. మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది సమతుల్య జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. దీనిని వారానికి కనీసం రెండుసార్లు తినాలి. ఇది కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
బీరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ కూరగాయలో ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీనిని తినడం ద్వారా మలబద్ధకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. జీర్ణశక్తి బాగుంటుంది. బీరకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.
బీరకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. తద్వారా డయాబెటిస్ ముప్పు తగ్గించుకోవచ్చు. నేచురల్ డీటాక్సిఫయర్ లాగా పనిచేసి కాలేయాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కాలేయం నుంచి విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. తద్వారా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
బీరకాయలో కేలరీలు తక్కువగా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తింటే తొందరగా కడుపు నిండి ఆకలి తగ్గుతుంది. తద్వారా ఫ్యాట్ ఏర్పడకుండా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, వాటర్ కంటెంట్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తద్వారా స్కిన్ హెల్తీగా ఉంటుంది.
మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు బీరకాయలో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు పెరగకుండా కాపాడి గుండెపై ఒత్తిడి నివారిస్తాయి. తద్వారా వయసు పెరిగినా గుండెను బలంగా ఉంచుకోవచ్చు. బీరకాయలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, వాటర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల వడబోత ప్రక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బీరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కీళ్ల మంట, వాపు నుంచి కాపాడుతాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




