Ghee Test: మీరు కొన్న నెయ్యి.. అసలైనదా.. కల్తీగా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఈజీగా కనిపెట్టండి!
నెయ్యి తినడం మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని అందిరికీ తెలుసు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల నెయ్యి బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. నెయ్యికి డిమాండ్ పెరగడంతో కొన్ని కంపెనీలు దాన్ని కల్తీ చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నాయి. కాబట్టి మీరు కొన్న నెయ్యి, అసలైనదో, కల్తీతో తెలుసుకునేందుకు ఈ టిఫ్స్ ఫాలో అవ్వండి.

హిందువుల్లో నెయ్యిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవుళ్లకు పెట్టే నైవేద్యాలు, ప్రసాదాల్లో దీన్ని ఎక్కువగా వాడుతారు. మన దేశంలో నెయ్యికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు డబ్బులు దండుకునేందుకు ఈ నెయ్యిని సైతం కల్తీ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. కాబట్టి మన కొనే నెయ్యి నిజమైనదో, లేదా కల్తీదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారిక సూచనల మేరకు మనం ఇంట్లోనే నెయ్యి నకిలీదా, అసలైనదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
నెయ్యి కల్తీదా, అసలైనదా గుర్తించడం ఎలా
రేవంత్ హిమత్సింకా అనే ఇన్‌ప్లూయెన్సర్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్వీట్‌ను షేర్ చేశారు, అందులో అతను ఇంట్లోనే అసలైన నెయ్యిని గుర్తించడానికి సులభమైన మార్గాన్ని వివరించాడు. స్వచ్ఛమైన నెయ్యిని పరీక్షించే ఈ పద్ధతి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకున్నట్టు అతను తెలిపాడుజ. ఈ టెస్ట్ చేసేందుకు.. మీరు ముందుగా ఒక గిన్నెలో మీ దగ్గరున్న నెయ్యిని తీసుకొని దానికి అయోడిన్ యాడ్ చేయాలి. ఆ తర్వాత రెండింటినీ బాగా కలపాలి. రెండింటి కలయిక తర్వాత నెయ్యి రంగు నీలం రంగులోకి మారితే, అది కల్తీ నెయ్యి అని అర్థం.. ఒక వేళ నెయ్యి రంగు మారకపోతే, అది మొదట ఎలా ఉందో అలానే ఉంటే.. అది నిజమైన నెయ్యి అని అర్థం.
ఇది కూడా చదవండి: డయాబెటీస్ రోగులు ఎగిరిగంతేసే టిప్.. రైస్ ఇలా వండితే.. అన్నం తిన్నా షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు!
నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
శీతాకాలంలో దేశీ నెయ్యి తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే వెచ్చదనం లక్షణాలు శరీరాన్ని చలి నుండి రక్షిస్తాయి. అంతేకాదు శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడానికి కూడా నెయ్యి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది, సహజ తేమ, మెరుపును అందిస్తుంది.
ఇది కూడా చదవండి:అల్లం వాడేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! లేదంటే తిన్నా వేస్టే!
View this post on Instagram
ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్ ఇదేనట.. దీన్ని ఎవరు వాడారో తెలుసా?
ఇది కూడా చదవండి: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా.. 90 శాతం మందికి తెలియని నిజాలివే! మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
