మీ ఇంట్లోని ఈ ప్లేస్‌లో మనీ ప్లాంట్ పెడితే డబ్బే డబ్బు.. పొరపాటున ఈ తప్పులు చేశారో..
ప్రతికూల శక్తిని తొలగించి, సంపదను ఆకర్షించే వాస్తు మొక్కల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మనీ ప్లాంట్, క్రాసులా వంటి మొక్కలను ఇంట్లో సరైన దిశలో ఉంచడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చు. ఈ మొక్కలు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొంది, ఇంట్లో సుఖశాంతులను నెలకొల్పుతాయి. అసలు వీటిని ఏ దిశలో పెడితే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటారు. ఇందుకోసం వాస్తు శాస్త్రం కొన్ని అద్భుతమైన మార్గాలను సూచించింది. ముఖ్యంగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలను సరైన దిశలో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి నశించి, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సంపదను ఆకర్షించే ఆ మొక్కల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనీ ప్లాంట్: సుఖశాంతులకు చిహ్నం
మనీ ప్లాంట్ అంటే తెలియని వారుండరు. దీన్ని ఆకులను ప్రేమ, శాంతి, సామరస్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇది వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని గాలిని శుభ్రపరుస్తుంది. వాస్తు ప్రకారం.. మనీ ప్లాంట్‌ను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఈ దిశ సంపదకు మూలం కాబట్టి ఆర్థిక పురోగతి ఉంటుంది. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిన ఆకులు ప్రతికూల శక్తిని ఇస్తాయి. అలాగే దీనిని వాయువ్య దిశలో లేదా నేరుగా ఎండలో ఉంచకూడదు.
మనీ ప్లాంట్ కంటే శక్తివంతమైన క్రాసులా
చాలా మందికి మనీ ప్లాంట్ గురించి మాత్రమే తెలుసు. కానీ వాస్తు శాస్త్రంలో క్రాసులా మొక్కను మనీ ప్లాంట్ కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా భావిస్తారు. దీనిని మనీ ట్రీ అని కూడా పిలుస్తారు. ఇంట్లో క్రాసులా మొక్క ఉంటే ఆర్థిక ఒత్తిడి తగ్గి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఈ మొక్క ఇంట్లో శక్తి సమతుల్యతను కాపాడుతుంది. ఇది వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా శుభప్రదం. వాస్తు ప్రకారం.. క్రాసులా మొక్కను ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సంపద వెల్లువెత్తుతుందని నమ్మకం. ఈ మొక్కకు ఎక్కువ నీరు అవసరం లేదు. కేవలం ఆకులను శుభ్రంగా ఉంచి, తగినంత సూర్యకాంతి తగిలేలా చూస్తే సరిపోతుంది.
మొక్కల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
వాస్తు నమ్మకాల ప్రకారం.. ఇంట్లో పచ్చని మొక్కలు ఉండటం వల్ల పర్యావరణం శుభ్రపడటమే కాకుండా మానసిక సమతుల్యత లభిస్తుంది. ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అయితే ఇతరుల నుండి మొక్కలను అప్పుగా తీసుకోకుండా మనమే సొంతంగా తెచ్చుకోవడం శ్రేయస్కరం.
(Note: ఈ సమాచారాన్ని జ్యోతిష్య శాస్త్రం, ఇతర అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించడం లేదు.)




