Mohanlal: మోహన్ లాల్ కెరీర్ లో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్
2025లో మోహన్‌లాల్‌కు అద్భుతమైన సక్సెస్‌లు, భారీ వైఫల్యం రెండూ ఎదురయ్యాయి. L2 ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. కానీ, ఏడాది చివరలో వృషభ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది, 120 కోట్ల బడ్జెట్‌తో కేవలం కోటి మాత్రమే వసూలు చేసింది. ఒకే ఏడాదిలో హైస్, లోస్ అనుభవించిన స్టార్ హీరో మోహన్‌లాల్!
సాధారణంగా స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తారు. అందుకే అయితే సక్సెస్, లేదా ఫెయిల్యూర్… ఒకటి ఏడాది ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉంటుంది. అదే ఒకే ఏడాది కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్, బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేస్తే.. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది..? అలాంటి డిఫరెంట్ సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు ఓ పాన్ స్టార్ హీరో, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అభిమానులకు లాస్ట్ ఇయర్ చాలా స్పెషల్. 2025లో మోహన్‌లాల్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్స్‌తో రేర్ రికార్డ్ సెట్ చేశారు. దీంతో ఏడాదంత లాలెటన్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఎల్2 ఎంపురాన్ సినిమాతో 300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్‌లాల్, తరువాత తుడరుమ్, హృదయపూర్వం సినిమాలతో వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేశారు. ఈ సక్సెస్‌లతో 2025లో మూడు బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ జోష్‌కు ఇయర్ ఎండింగ్‌లో బ్రేక్ పడింది. ఏడాది చివర్లో మోహన్‌లాల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఫాంటసీ మూవీ వృషభ రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 25న రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. మోహన్‌లాల్ గత చిత్రాల సక్సెస్ ఈ సినిమా బుకింగ్స్ విషయంలో ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో తొలి రోజు అతి తక్కువ వసూళ్లు సాధించిన స్టార్ హీరో సినిమాగా చెత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది వృషభ. 2023లోనే షూటింగ్ మొదలు పెట్టినా… రకరకాల కారణాలతో డిలే అయ్యింది వృషభ. దీంతో బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు కోటి రూపాయలు మాత్రమే రికవర్ చేసింది. ఆల్మోస్ట్ థియెట్రికల్ రన్ కూడా క్లోజ్ అయ్యింది కాబట్టి.. ఈ సినిమా 2025లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు క్రిటిక్స్. మరి ఈ సిచ్యుయేషన్ నుంచి లాలెటన్ మళ్లీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
చనిపోయాడనుకున్నారు.. 28 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చాడు వీడియో
థాయిలాండ్‌లో ధోని హల్ చల్.. ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా?
సోమనాథ్ ఆలయానికి అంబానీ భారీ విరాళం వీడియో
మెక్సికోలో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు వీడియో
రీల్స్ కోసం పట్టాలపై పడుకున్న.. సాహస యువకుడికి ‘సన్మానం’వీడియో

