Nayanthara: ప్రమోషన్స్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార
సినిమా ప్రమోషన్స్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే నయనతార, ఈ మధ్య తన సొంత చిత్రాలకు ముందుకొచ్చింది. 'మన శంకర వరప్రసాద్ గారు' కోసం ఆమె చేసిన స్పెషల్ వీడియోతో మనసు మార్చుకుందని అందరూ భావించారు. అయితే, లేటెస్ట్ న్యూ ఇయర్ వీడియో ఆమె ప్రమోషన్స్‌పై మళ్లీ గందరగోళాన్ని సృష్టించింది. ఆమె ఈసారి వస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
గతంలో సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న నయనతార ఈ మధ్య కాస్త మారారు. తను నిర్మించిన సినిమాల ప్రమోషన్స్‌లో సందడి చేశారు. అదే సమయంలో మన శంకర వరప్రసాద్ గారు లాంచింగ్ టైమ్‌లో స్పెషల్ వీడియో చేసి షాక్ ఇచ్చారు. దీంతో నయన్ మనసు మార్చుకున్నారన్న టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ వీడియోతో మరోసారి కన్‌ప్యూజన్‌కు తెరలేపారు ఈ బ్యూటీ. లేడీ సూపర్ స్టార్‌గా నెంబర్ వన్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తున్న నయనతార, సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఎప్పుడు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ప్రమోషన్స్‌లో పాల్గొన్నా.. టాప్ రేంజ్‌కు వచ్చిన తరువాత పూర్తిగా ఈవెంట్స్‌కు దూరమయ్యారు. కానీ ఈ మధ్య కాలంలో కాస్త మారారు నయన్. నిర్మాతగా మారిన తరువాత సొంత సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు బయటకు వస్తున్నారు నయన్. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న మన శంకర వరప్రసాద్‌గారు సినిమా విషయంలో మరింత యాక్టివ్‌గా కనిపించారు. ఆ సినిమా కోసం స్పెషల్ వీడియోస్ చేశారు. మన శంకర వరప్రసాద్‌గారు షూటింగ్ స్టార్ట్ అయిన టైమ్‌లో నయన్ చేసిన ప్రమోషనల్ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆమె ఈ సినిమా ఈవెంట్స్‌లోనూ కనిపిస్తారని భావించారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్ వీడియోతో మరోసారి ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టారు ఈ బ్యూటీ. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోతో.. నయన్ ప్రమోషన్స్‌లో కనిపించే ఛాన్స్ లేదా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. లేటెస్ట్ వీడియోను ప్రమోషన్స్ గురించే డిజైన్ చేశారు. నయన్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదని, జస్ట్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయండి చాలు అంటూ స్వయంగా దర్శకుడు అనిల్ చెబుతున్నట్టుగా క్రియేట్ చేసిన వీడియో కొత్త డౌట్స్ రెయిజ్ చేస్తోంది. ఈ వీడియో తరువాత నెక్ట్స్ ప్రమోషన్స్‌లో నయన్ ఉంటారా లేదా అన్న విషయంలో మరోసారి సస్పెన్స్ మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి..
ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే

