చైనాలో ఒక వ్యక్తి తన విషపూరితమైన పెంపుడు పాముకు చేత్తో ఆహారం తినిపించేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తూ దాని కాటుకు గురయ్యాడు. ఈ ఘటనలో అతను తన చేతి వేలిని కోల్పోయాడు. బీజింగ్‌లో జరిగిన ఈ సంఘటన పాములను పెంచుకునేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తుచేస్తోంది.