03 January 2026

ఆరోజే సినిమాలు ఆపేద్ధాం అనుకున్నా.. రీజన్ చెప్పిన కృతి శెట్టి..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే హిట్టుకొట్టింది.

ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. అందులో కేవలం రెండు సినిమాలు శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఈ రెండు సినిమాల తర్వాత ఆమె నటించిన ప్రాజెక్టులు మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేదు. వరుసగా డిజాస్టర్స్ రావడంతో తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. 

 ప్రస్తుతం కృతి శెట్టి తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తన తొలి సినిమా ఉప్పెన షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలు తెలియజేస్తూ భావోద్వేగానికి గురైంది. ఉప్పెన సినిమా కంటే ముందు ఏం జరిగిందో వెల్లడించింది.

ఉప్పెన షూటింగ్ కు ముందు సినిమాల గురించి ఒక రకంగా ఊహించి వచ్చానని.. కానీ ఆచరణలో ఎదురైన కష్టాలు తన అంచనాలకు భిన్నంగా ఉన్నాయని తెలిపింది.

ఆ పాత్ర చాలా డిమాండ్ చేసిందని.. కానీ తను ఆ స్థాయికి మానసికంగా, శారీరకంగా రెడీగా రాలేదని తెలిపింది. షూటింగ్ సమయంలో విపరీతమైన ఒత్తిడికి గురైందట.

స్ట్రెస్ కారణంగా వెంట్రుకలు రాలిపోవడం, చర్మ సమస్యలు రావడంతో మానసిక వేదనకు గురైంది. దీంతో ఉప్పెన సినిమా తర్వాత ఇండస్ట్రీని వదిలేద్ధామని అనుకున్నట్లు తెలిపింది.