ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన అజయ్ రాజ్‌భర్ రీల్స్ పిచ్చితో రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలపై పడుకుని వేగంగా వెళ్తున్న రైలును వీడియో తీశాడు. ఈ ప్రాణాంతక స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రైల్వే చట్టాల ఉల్లంఘన, ఇతరులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించినందుకు అజయ్‌ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.