Dhruv Vikram : టాలీవుడ్లోకి విక్రమ్ తనయుడు.. బైసన్ రిలీజ్ ఎప్పుడంటే..
చియాన్ విక్రమ్.. తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన విక్రమ్.. ఇటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో విక్రమ్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ చేయగా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విక్రమ్ తనయుడు సైతం తెలుగు సినీరంగంలోకి అడుగుపెడుతున్నాడు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు. హీరోయిజం చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు తమిళంతోపాటు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విక్రమ్.. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. మరోవైపు విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ సైతం ఇండస్ట్రీలో హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో వర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ విక్రమ్. తొలి చిత్రంతోనే నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. కానీ కమర్షియల్ గా ఈ సినిమా అంత సక్సెస్ కాలేదు. నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ధృవ్. ఆ తర్వాత తన తండ్రితో కలిసి మహాన్ చిత్రంలో నటించారు. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలై మంచి రివ్యూస్ అందుకుంది. ఇక ఇప్పుడు హీరోగా బైసన్ సినిమాతో హిట్టు కొట్టాడు.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
సరైన కథ.. దర్శకుడి చేతిలో పడితే తన సత్తా చాటగలనని బైసన్ సినిమాతో నిరూపించుకున్నాడు ధృవ్. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన బైసన్ సినిమా దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చింది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ మూవీ విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకుది. డైరెక్టర్ పా. రంజిత్ సొంత నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిపి ఈ సినిమాను నిర్మించగా.. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఒక చిన్న గ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనేదే బైసన్ చిత్రం. ఇందులో ధృవ్ విక్రమ్ హీరోగా, అతడి అక్కగా రజిషా విజయన్, తండ్రి పశుపతి, కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితోపాటు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కే.ప్రసన్న అందించిన మ్యూజిక్ మరో హైలెట్. ఈ సినిమాలో తనదైన నటనతో పాత్రకు ప్రాణం పోశారు ధృవ్ విక్రమ్. ఇక ఇప్పుడు బైసన్ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. అదే పేరుతో తెలుగులో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. అంతకుముందు మారీ సెల్వరాజ్ తెరకెక్కించిన మామన్నన్, కర్ణన్, వాజై చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు బైసన్ సైతం తెలుగులో సూపర్ హిట్ కావడం ఖాయమని అంటున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..




