Ram Charan : ఏమున్నాడ్రా బాబు.. చరణ్ వేట మొదలెడితే ఇట్టా ఉంటుంది.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న వీడియో..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే 60 శాతం పూర్తైనట్లు సమాచారం.. మరోవైపు కొన్ని రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ చిత్రాల్లో పెద్ది ఒకటి. ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ చిత్రాల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఇది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పటికే 60 శాతం పూర్తైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇదివరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ఇందులో పక్కా ఊర మాస్ అవతారంలో చరణ్ కనిపించనున్నారు. పెద్ద జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు చరణ్. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో పెద్ది సినిమాకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. ఆ వీడియోలో రామ్ చరణ్ తోపాటు.. డైరెక్టర్ బుచ్చిబాబు సన, మిగతా టీం మొత్తం పెద్ద కొండను ఎక్కుతూ కనిపించారు. ముఖ్యంగా చరణ్.. మాస్ అవతారంలో కొండను ఎక్కుతూ.. మోకాళ్లపై చేతులు పెట్టుకుని అలసిపోయినట్లు కనిపించారు. వీడియో చూస్తుంటే అతి కష్టం మీద లోయ నుంచి వీరందరూ బయటకు వస్తున్నట్లు ఉంది. ఇదివరకు ఎవరూ చేయని లొకేషన్లలో పెద్ది షూటింగ్ జరుగుతుందని.. ఈ సినిమా కోసం చరణ్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఇప్పుడు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమా కోసం చరణ్ ఎంతో కష్టపడుతున్నారని.. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని.. చరణ్ వేట మొదలెడితే , ఆ మిగిలిన వేట కోసం నక్కలు , తోడేలు మిగతా జంతువులు ఎదురు చూస్తాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
గురూజీ చెప్పినట్టు చరణ్ వేట మొదలెడితే , ఆ మిగిలిన వేట కోసం నక్కలు , తోడేలు మిగతా జంతువులు ఎదురు చూస్తాయి 🔥#PEDDI on its way for a biggest blockbuster 💥
— ArunKumar (@arunganta) October 17, 2025
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




