Murali Nayak Biopic: ఇట్స్ అఫీషియల్.. అమర జవాన్ మురళీ నాయక్ జీవితంపై సినిమా.. హీరో ఎవరంటే?
భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన 'ఆపరేషన్ సింధూర్'లో అమరుడైన తెలుగు జవాన్ మురళీ నాయక్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కనుంది.తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు.

భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’లో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా కళ్లెతండాకు చెందిన మురళీ నాయక్ 2022లోఅగ్నివీర్ గా భారత సైన్యంలో చేరాడు. ఆపరేషన్ సింధూర్ ముందు వరకు వేర్వేరు చోట్ల పనిచేసిన మురళీ నాయక్ భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో కశ్మీర్ కు వచ్చాడు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహరా కాస్తూ పాక్ సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. . సైనికుడిగా దేశానికి సేవ చేయాలని సైన్యంలో చేరిన మురళీ నాయక్ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచి వేసింది. ఈ విషాదం నుంచి అతని కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అమర జవాన్ జీవిత కథ ఆధారంగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని విశాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. యంగ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ ఈ చిత్రంలో మురళీ నాయక్ పాత్రను పోషించనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
కాగా కొన్ని రోజుల క్రితం గౌతమ్ కృష్ణ అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాడు. తన సినిమా సోలో బాయ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ స్టేజ్ పైనే మురళీ నాయక్ కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశాడు. ఇప్పుడు అదే అమర జవాన్ బయోపిక్ లో నటించేందుకు రెడీ అయ్యాడు గౌతమ్. ‘ఇది కేవలం ఒక సినిమా కాదు. ఒక రియల్ హీరో స్టోరీ. ఇప్పటివరకు తెలుగు సైనికుడి జీవితంపై ఒక్క బయోపిక్ కూడా రాలేదు. ఇదే తొలి ప్రయత్నం. సోలో బాయ్ సినిమా విడుదల సమయంలోనే మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడాను. అప్పుడే ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మురళీ నాయక్ గురించి చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదు. ఇంతటి గొప్ప గాథను తెరపైకి తీసుకొచ్చే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన తల్లిదండ్రులను అనుమతి కోరగా, వారు ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించారు’ అని గౌతమ్ చెప్పుకొచ్చారు.
పాన్ ఇండియా స్థాయిలో మురళీ నాయక్ బయోపిక్..
View this post on Instagram
గౌతమ్ కృష్ణ హీరోగా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








