Rahul Sipligunj: చడీచప్పుడు కాకుండా ప్రేయసితో.. రాహుల్ ఎంగేజ్‌మెంట్
ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. సినిమా పాటలు, మ్యూజిక్ వీడియోలతో బిజీ బిజీగా ఉండే ఈ హైదరాబాదీ సింగర్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు.
తాజాగా రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆదివారం అంటే ఆగస్టు 17 న తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుకు జరిగింది. అయితే రాహుల్ కానీ, అతని కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ ఎంగేజ్ మెంట్ ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాహుల్ సిప్లిగంజ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాహుల్‌కు కాబోయే సతీమణి పేరు హరిణి రెడ్డి అని తెలుస్తుంది. కానీ ఆమె గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిశ్చితార్థం సందర్భంగా రాహుల్- హరిణీ రెడ్డి కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీలో రాయల్ గా కనిపించగా, హరిణి ఆరెంజ్ కలర్ లెహంగాను ధరించి అందంగా ముస్తాబైంది. మొత్తానికి ఈ జంట చూడముచ్చటగా ఉందంటున్నారు అభిమానులు, నెటిజన్లు. అలాగే తన పెళ్లిపై రాహుల్ అధికారిక ప్రకటన కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీని చూపిస్తూ.. స్టార్ హీరోలకు సజ్జనార్ చురకలు
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు
AP Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో హైఅలర్ట్
కలర్ తక్కువంటూ కామెంట్లు.. ఛాతీపై టాటూతో నోరుమూయించిన హీరోయిన్
స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్! ఆమె నోటి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

