కలర్ తక్కువంటూ కామెంట్లు.. ఛాతీపై టాటూతో నోరుమూయించిన హీరోయిన్
అక్కడెక్కడో అమెరికాలో కాదు.. మన దగ్గర కూడా రంగు చూసుకుని వివక్ష చూపిస్తుంటారు. చామన ఛాయగా ఎవరైనా ఉంటే చాలు.. వారిని ఏదొక రకంగా విమర్శిస్తుంటారు. పలు రకాల కామెంట్స్‌తో.. వాళ్ల ఆత్మ విశ్వాన్ని దెబ్బ తీస్తుంటారు. అయితే మలయాళ హీరోయిన్ నిమిషా విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ అందుకు ఆమె, ఓ పచ్చబొట్టుతో అందరి నోరు మూయించేసింది.
ఎదుటి వారు ఎన్ని విమర్శలు చేసినా.. తన ఆత్మవిశ్వాసం సడలిపోకుండా చూసుకుంది. దాంతో పాటే వారి నోరూ మూయించింది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తోంది నిమిషా సజయన్. తన అందం, అభినయంతో తనకంటూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కమర్షియల్ హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ న్యాచురల్ యాక్టింగ్ తో దూసుకెళ్లిపోతోంది. అంతేకాదు మేకప్ లేకుండానే నటిస్తూ వరుసగా హిట్స్ అందుకుంటోంది. ఇటీవల ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన DNA తెలుగులో ఓ మై బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. ఈ మూవీలో హీరోగా అధర్వ నటిస్తే, అతని భార్య పాత్రలో నిమిషా సజయన్ అద్భుతంగా నటించింది. దీంతో మరోసారి ఈ మలయాళ ముద్దుగుమ్మ పేరు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. కేరళకు చెందిన నిమిషా మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి తైక్వాండో సాధన చేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. ఇక హీరోయిన్ గా పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించిందీ అందాల తార. తెలుగులో నేరుగా నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది. ఇక రియల్ లైఫ్ లో ఎంతో సింపుల్ గా కనిపించే నిమిషా రీల్ లైఫ్ లోనూ మేకప్ వేసుకోనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఛాతీ పై భాగంలో సూర్యచక్రపు గుర్తుతో ఓ టాటూ ఉంటుంది. దీని వెనక ఉన్న అర్థమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చామన చాయ రంగులో ఉండే నిమిషా తన కెరీర్ ప్రారంభంలో వివక్ష ఎదుర్కొందట. ఇలాగే ఉంటే సినిమాలు రావు అని ముఖం మీదే చెప్పేశారట. అయితే నిమిషా మాత్రం ప్రతిభకు రంగు అడ్డం కాదంటూ ముందుకు సాగి సక్సెస్ అయ్యిందట. అందులో భాగంగానే ఆత్మవిశ్వాసానికి ప్రతీకగానే తన ఛాతీపై భాగంలో సూర్యచక్రం గుర్తును టాటూగా వేయించుకుందట. ఆ ట్యాటూతో.. పాటే.. దాని అర్థం కూడా వివరిస్తూ.. తనను రంగు తక్కువంటూ విమర్శించిన వారి నోరు మూయించిందట ఈ హీరోయిన్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్! ఆమె నోటి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరో
Divvela Madhuri: బిగ్ బాస్‌లోకి మాధురి.. మరి దువ్వాడ సంగతేంటో?
మరీ ఇంత తేడాగా ఉన్నారేంట్రా.. అగ్నిపరీక్ష మీకు కాదు.. చూసే మాకు
ప్రేమికుడి కోసం ప్లాస్టిక్ పడవలో సముద్రం దాటొచ్చిన యువతి.. ఆ తర్వాత?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

