AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో హైఅలర్ట్

AP Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో హైఅలర్ట్

Phani CH
|

Updated on: Aug 19, 2025 | 6:06 PM

Share

వర్ష బీభత్సానికి ఏపీ వణుకుతోంది...! మరో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మంగళవారం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావంతో మంగళవారం తెలుగురాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు భారీ వర్షసూచన ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవారం పాటు వర్షాలుంటాయంటూ 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం… ఈ ఏడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్‌ ఉందన్నారు. ఏడు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చారు. ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఏలూరు, విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాలను వానలు భయపెడుతున్నాయి. భారీ వర్షాలతో అల్లూరి జిల్లా డుంబ్రిగూడలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కించమండ, కితలంగి గ్రామాల మధ్యలోని కాజ్వేపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దాంతో.. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి.. జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో.. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో ఇప్పటికే ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కూ వరద కొనసాగుతోంది. ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలర్ తక్కువంటూ కామెంట్లు.. ఛాతీపై టాటూతో నోరుమూయించిన హీరోయిన్

స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్! ఆమె నోటి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరో

Divvela Madhuri: బిగ్ బాస్‌లోకి మాధురి.. మరి దువ్వాడ సంగతేంటో?

మరీ ఇంత తేడాగా ఉన్నారేంట్రా.. అగ్నిపరీక్ష మీకు కాదు.. చూసే మాకు

ప్రేమికుడి కోసం ప్లాస్టిక్ పడవలో సముద్రం దాటొచ్చిన యువతి.. ఆ తర్వాత?