విమానం వస్తే.. రైలు ఆగిపోవల్సిందే.. ఎక్కడో తెలుసా?
రన్‌వేపై కొద్దిగా నీళ్లు పడినా విమానం ల్యాండ్ అయ్యే అవకాశాన్ని అధికారులు తిరస్కరిస్తారు. అలాంటది ఒకే రన్‌వే మధ్యలో రైల్వే లైన్ ఉందని ఊహించగలరా? ప్రపంచంలో ఇలాంటి వింతలు ఉన్న ఏకైక ఎయిర్‌పోర్ట్ న్యూజిలాండ్ లోని గిస్‌బోర్న్ విమానాశ్రయం. సాధారణంగా రైలు వస్తున్నప్పుడు, దాని మార్గాన్ని దాటే వాహనాలను తాత్కాలికంగా ఆపేస్తారు.
కాని ఇక్కడ మాత్రం, విమానం వస్తుంటే రైలునే నిలిపివేస్తారు..! ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది కల కాదు, నిజమే..! అది న్యూజిల్యాండ్ ఉత్తరద్వీపంలో గిస్‌బోర్న్. ఈ ఎయిర్‌పోర్ట్ రన్‌వేను రెండు ముక్కలు చేస్తున్నట్లుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేశారు. అంటే, ఒకే చోట రైల్వే సేవలు, విమానయాన కార్యకలాపాలు రెండిటికి వినియోగిస్తున్నారు. న్యూజిల్యాండ్ ఉత్తరద్వీపం. ఇది సుమారు 160 హెక్టార్ల విస్తీర్ణలో ఉన్న చిన్న నగరం. అక్కడి గిస్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్ ఈ అద్భుత సదుపాయం వల్ల అందరినీ ఆకర్షిస్తోంది. పాల్మెరస్టన్ నార్త్ నుంచి గిస్‌బోర్న్ వరకు వెళ్లే రైల్వే లైన్ నేరుగా ఈ విమానాశ్రయ రన్‌వే పైగానే వెళ్తుంది. ఈ విమానాశ్రయం ప్రతి రోజు ఉదయం 6గంటల 40నిమిషాల నుంచి రాత్రి 8గంటల 30నిమిషాల వరకు మాత్రమే కార్యకలాపాల కోసం తెరిచి ఉంటుంది. ఇక్కడి సిగ్నలింగ్ వ్యవస్థను విమానాశ్రయ సిబ్బందే నేరుగా పర్యవేక్షిస్తారు. విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్ దశలోకి వస్తే, తాత్కాలికంగా రైళ్ల రాకపోకలు ఆపివేస్తారు. విమానాలకు మొదటి ప్రాధాన్యత ఇక్కడ. అలాగే, రైళ్లు,విమానాలు ఒకే సమయానికి రాకుండా ఉండేందుకు సమయ పట్టికను ముందుగానే సమన్వయం చేస్తారు. అయితే చిన్నచిన్న మార్పులు అప్పుడప్పుడూ సహజమే. ప్రపంచంలోనే రన్‌వే మీదుగా రైల్వేలైన్ వెళ్తున్న ఏకైక ఎయిర్‌పోర్ట్‌గా గిస్‌బోర్న్ నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపునొప్పితో ఆస్పత్రికి పదేళ్ల బాలిక.. సర్జరీ చేసి చూస్తే షాక్
అమ్మబాబోయ్.. చెట్టుకి దెయ్యం పట్టిందా.. ఏం జరిగిందో చూస్తే..!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

